English | Telugu

‘ఏసేశాడు.. బాగా ఏసేశాడు..’ సమంతకు జరిగిందే నయనతారకూ రిపీట్‌ అయింది!

సోషల్‌ మీడియా బాగా విస్తరించడంతో సెలబ్రిటీలు ఎంతో జాగ్రత్తగా పోస్టులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారు విపరీతమైన ట్రోలింగ్‌కి గురవుతున్నారు. అలా ఈమధ్య చాలా మంది ట్రోలింగ్‌ బారిన పడ్డారు. టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత పెట్టిన ఓ పోస్ట్‌పై ఆమధ్య పెద్ద దుమారమే రేగింది. ఆమెను అరెస్ట్‌ చెయ్యాలంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. సమంత మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడి ఎంతో కాలం చికిత్స తీసుకున్న తర్వాత దాని నుంచి బయటపడిరది. చికిత్స సమయంలో షూటింగులకు కూడా హాజరు కాలేదు. ఆ టైమ్‌లోనే సమంత పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌ అయింది. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఓ హెల్త్‌ టిప్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దానిపై ఓ డాక్టర్‌ రియాక్ట్‌ అయ్యాడు. హెల్త్‌కి సంబంధించి సమంత పెట్టిన పోస్ట్‌ కరెక్ట్‌ కాదని, తన ఫాలోవర్స్‌ని ఆమె తప్పు దారి పట్టిస్తోందని విమర్శించాడు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తున్న సమంతను అరెస్ట్‌ చెయ్యాలంటూ ఘాటుగా స్పందించాడు.

ఇప్పుడు మరో హీరోయిన్‌ నయనతార వంతు వచ్చింది. తన ఇన్‌స్టాలో ఒక టీ గురించి ఆమె ఓ పోస్ట్‌ వేసింది. మందార పువ్వు వేసిన టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, రోగ నిరోధకశక్తి పెరుగుతుందని సెలవిచ్చింది. అంతేకాదు, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్‌, బీపీ ఉన్నవారికి ఈ టీ ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని సలహా ఇచ్చింది. ఈ పోస్ట్‌పై పెద్ద చర్చే జరిగింది. అంతకుముందులాగే ఈ పోస్ట్‌పై ఓ డాక్టర్‌ స్పందిస్తూ.. నయనతార చెప్పిన దానిలో వాస్తవం లేదని, ఎవరూ దాన్ని నమ్మొద్దు అంటూ రిప్లై ఇచ్చాడు. డాక్టర్‌ వేసిన ట్వీట్‌ వైరల్‌ అయి అది నయనతారను ట్రోల్‌ చేసే వరకు వెళ్లింది. నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతూ ఆమెను విమర్శించారు. దాంతో తను పెట్టిన పోస్టుని డిలీట్‌ చేసింది నయన్‌. ఇలా తమకు సంబంధం లేని, అవగాహన లేని హెల్త్‌ టిప్స్‌ ఇవ్వడం ఎవరికీ ఆరోగ్యకరం కాదు. ఇలాంటి విషయాల్లో వాస్తవాన్ని సెలబ్రిటీలు గుర్తించాలంటూ నెటిజన్లు హితబోధ చేస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.