English | Telugu
'పుష్ప 2'తో రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్
Updated : Aug 13, 2023
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా పాన్ ఇండియా చిత్రం 'పుష్ప ది రూల్'. రెండేళ్ల ముందు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప ది రైజ్' చిత్రానికి ఇది కొనసాగింపుగా తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే. పార్ట్ 1 ఏకంగా రూ.300 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా కరోనా పరిస్థితులు పూర్తిగా తొలిగిపోక ముందే. అంతే కాకుండా అందులో అల్లు అర్జున్ మేనరిజమ్, డాన్స్ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలందరూ రీల్స్‌గా చేసిన సంగతి తెలిసిందే. తగ్గేదే లే అనే స్టైల్ అందరికీ బాగా ఎక్కేసింది. దీంతో 'పుష్ప 2'పై అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగినట్లే దర్శక నిర్మాతలు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఆ మధ్య అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (ఏప్రిల్ 8) విడుదల చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ ఫొటో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్ చల్ చేశాయి. ట్రెండింగ్‌లో కొనసాగాయి. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అయితే అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అందులో ఐకాన్ స్టార్ గన్ పట్టుకుని అమ్మవారి లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడీ పోస్టర్ నేషనల్ వైడ్‌లో ఓ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. నాలుగు నెలల్లోనే ఈ పోస్టర్‌కు ఏకంగా 7 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు మరే హీరోకు రానటువంటి లైక్స్ ఇవి.
రిలీజ్‌కు ముందే 'పుష్ప 2' రూపంలో రికార్డుల వేటను అల్లు అర్జున్ స్టార్ట్ చేశారు. మరి రిలీజ్ తర్వాత ఈ మూవీ ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి మరి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ప్రథమార్థంలో బన్నీ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప 2' సినిమాను విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచన.