English | Telugu
వల్లంకి పిట్ట అంటే ఆడియన్స్ కి ఒక ఐడెంటిటీ.. ఇప్పుడంతా పొట్టి పిల్ల అంటున్నారు
Updated : Aug 13, 2023
కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయంగా అక్కరలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. "మసూద" మూవీతో హీరోయిన్ గా చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. "బలగం" మూవీతో ఘన విజయాన్ని అందుకొని ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంది. అయితే కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్జున్ తో "గంగోత్రి" మూవీలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసింది.
రీసెంట్ గా "ఉస్తాద్" మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కావ్య ఎన్నో విషయాలు చెప్పింది. "అందరూ నిన్ను వల్లంకి పిట్ట అని పిలుస్తుంటే నాకైతే నచ్చలేదు" అని ఇంటర్వ్యూ చేసే పర్సన్ అనేసరికి " అందులో తప్పేముంది... యూట్యూబ్ లో గానీ ఎక్కడైనా కానీ చైల్డ్ ఆర్టిస్టు అంటే, ఒక ఐడెంటిటీ కోసం మాత్రమే అలా పిలుస్తారు. కావ్య అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.. ఇంకా చెప్పాలంటే, నాకు చాలా గర్వంగా ఉంది 20 ఏళ్ళ కిందట నేను నటించిన పేరుని గుర్తుపెట్టుకుని ఇంకా అలానే పిలవడాన్ని నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను" అని చెప్పింది కావ్య.
ఇక కావ్య మాటలకు మధ్యలో ఎంట్రీ ఇచ్చిన ఉస్తాద్ మూవీ హీరో శ్రీసింహ "ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బలగం సినిమా రిలీజ్ అయింది. ఈ బలగం సినిమా రిలీజ్ కాకముందు కావ్యని అందరూ చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, వల్లంకి పిట్ట కావ్య అని పిలిచేవారు. సినిమా రిలీజ్ ఐన తర్వాత నుంచి "పొట్టి పిల్ల పొట్టి పిల్ల..." అని పిలుస్తున్నారు... ఆ పేరు కూడా అంత పెద్ద హిట్ అయింది." అని చెప్పాడు .
"అవును ఎక్కడికెళ్లినా పొట్టిపిల్లా అంటున్నారు.. నేను దీన్ని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇక నుంచి అందరూ ఉస్తాద్ మూవీ చూసాక బామ్మ అని పిలవడం మొదలు పెడతారు. ఎందుకంటే హీరో ఇక్కడ నన్ను బామ్మ" అని పిలుస్తాడు అని చెప్పింది కావ్య . " మీరు నటించిన సినిమాలో బలగం బాగా హిట్ కొట్టడంతో అందరూ మిమ్మల్ని లక్కీ అంటున్నారు" అనేసరికి "ఇలాంటి డైరెక్టర్స్, రైటర్స్ నా దగ్గరకు వస్తున్నారు, అంటే ఏదో జన్మలో నేను పుణ్యం చేసుకుని ఉంటాను..సో ఐయామ్ లక్కీ..." అని కావ్య తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసింది.