English | Telugu
టైగర్ హంగామాకి డేట్ ఫిక్స్.. రవితేజ లుక్‌పై సర్వత్రా ఆసక్తి
Updated : Aug 12, 2023
మాస్ మహారాజా రవితేజ టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావ్’. వంశీ దర్శకత్వంలో సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ పీరియాడిక్ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 20న రిలీజ్ అవుతుంది. కార్తికేయ, ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాల తర్వాత అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న సినిమా ఇది. రవితేజ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అందించారు మేకర్స్ టైగర్ ఇన్వాషన్ పేరుతో టీజర్‌ను ఆగస్ట్ 17న రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు.
రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్‌లో పేరు మోసిన గజదొంగగా పేరు సంపాదించుకున్న నాగేశ్వరరావు పోలీసులను గడగడలాడించారు. పేద ప్రజలు తనను రాబిన్ హుడ్‌గా భావించి టైగర్ నాగేశ్వరరావు అని పిలుచుకునేవారు. ధనవంతులను దోచుకుని పేదలకు ఆ సంపదను పంచి పెట్టేవారు. అతని బయోపిక్‌నే ఇప్పుడు సినిమాగా తీశారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తే, జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా మెప్పించిన రవితేజ, తర్వాత రావణాసుర సినిమాతోనూ సందడి చేసిన సంగతి తెలిసిందే. వరుసగా సీజన్స్‌ను టార్గెట్ చేసుకుని సినిమాలను రిలీజ్ చేస్తోన్న రవితేజ.. దసరా సీజన్2లో టైగర్ నాగేశ్వరరావ్ చిత్రంతో అలరించనున్నారు.