English | Telugu
అసలు ఇందుకే చనిపోతున్నారు..జాకెంట్ ఇండియా రావాలంటున్న పూరి జగన్నాధ్
Updated : Dec 27, 2024
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(puri jagannadh)ప్రస్తుతం వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్,రామ్ పోతినేని తో చేసిన డబుల్ ఇస్మార్ట్ పై పూరి ఎన్నో ఆశలు పెట్టుకున్నాకూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.ప్రస్తుతానికైతే తన అప్ కమింగ్ మూవీ మీద ఎలాంటి అప్ డేట్ ఇంకా రాలేదు.
ఇక పూరి ఎప్పట్నుంచో సోషల్ మీడియాలో 'పూరి మ్యూజింగ్స్' ద్వారా రకరకాల అంశాల గురించి తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తుంటాడు.రీసెంట్ గా 'జాకెంట్' అనే అంశం మీద ఆయన మాట్లాడుతు యుద్ధ సమయాలతో పాటు రక రకాల ఇబ్బందులు వల్ల చాలా మంది ప్రజలు కట్టుబట్టలతో,భార్య బిడ్డల్ని తీసుకొని వేరే ప్రాంతాలకి వలస వెళ్తుంటారు. వీరు ఏ దేశమైతే వెళ్తారో అక్కడ ఇల్లు అనేది ఉండదు.నైజీరియా,ఇరాక్,సుడాన్,ఇండియా,చైనా,కాలిఫోర్నియా, న్యూయార్క్,ఇరాక్, ఫ్లోరిడా వంటి దేశాల్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.ప్రపంచంలో ఐదు శాతం జనాభాకి ఇల్లు కూడా లేదు.ఇండియాలో అయితే నాలుగు కోట్ల మంది అడుక్కు తినే వాళ్ళు కూడా ఉన్నారు.అలాంటి వాళ్లంతా వర్షం వస్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి.ఇలా వసతి సోకార్యం లేకుండా వడ దెబ్బతో పాటు తీవ్రమైన చలికి చాలా మంది చనిపోతున్నారు.
అలాంటి వారందరి కోసం 'ఏంజెలా లూనా' అనే ఒక మహిళాడిజైనర్ ఒక అద్భుతమైన డిజైన్ ని సృష్టించింది.దాని పేరు 'జాకెంట్'.జాకెట్,టెంట్ ని కలిపి చేసిన డిజైన్ అది.దీన్ని జాకెట్ ల వేసుకోవడంతో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెంట్ లా వాడుకొని అందులో పడుకోవచ్చు.పైగా ఈ జాకెంట్ ఎంతో మంది సిరియా శరణార్థులని కాపాడింది.ఇప్ప్పుడు ఆ 'జాకెంట్'.ఇండియాకి వస్తే మనం
ఏదైనా కాంప్ కి వెళ్ళినప్పుడు వాడుకోవడంతో పాటుగా అడుక్కునే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు.ఏదైనా కంపెనీ దీనిని ఇండియాకి పరిచయం చేస్తే బాగుండు.ఎంతో మంది ప్రాణాలని కాపాడిన వాళ్లవుతారని చెప్పుకొచ్చాడు.