English | Telugu
'కల్కి' వివాదం.. కేసు వేస్తున్న నిర్మాతలు
Updated : Sep 17, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కల్కి2898 AD’ ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ సి.అశ్వినీదత్ ఈ చిత్రాన్నిఅన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇలా ఉంటుంది..అలా ఉంటుందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి.. వస్తున్నాయి. రీసెంట్గా దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయగా నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వివాదం బయటకు వచ్చింది. అదేంటంటే ప్రభాస్ లుక్‌కి సంబంధించి. ‘కల్కి2898 AD’లో ప్రభాస్ కొత్త లుక్ మేకర్స్ అనుమతి లేకుండా బయటకు లీకైంది.
‘కల్కి2898 AD’ లీకేజీ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్న మేకర్స్ అసలు ఎవరి నుంచి ఈ లుక్ లీకైందనే దానిపై ఆరా తీసి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. మూవీకి వి.ఎఫ్.ఎక్స్ బాధ్యతలను నిర్వహిస్తోన్న సంస్థ నుంచే ఈ ఫొటో బయటకు లీకైంది. దీంతో నిర్మాతలు సదరు వి.ఎఫ్.ఎక్స్ సంస్థపై కేసు వేస్తున్నారు. భారీ మొత్తంలో ఫైన్ డబ్బులను వసూలు చేయాలని వారు భావిస్తున్నారు. మరి దీనిపై సదరు సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇంకా తెలియటం లేదు.
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘కల్కి2898 AD’ రూపొందుతోంది. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె సహా పలువురు పాన్ ఇండియా స్టార్స్ ఇందులో నటిస్తుండటం విశేషం. అధర్మం పెరిగినప్పుడు తాను కల్కిగా ఉద్భవిస్తానని మహావిష్ణువు చెప్పినట్లు మన గాథల్లో ఉంది. దాన్ని బేస్ చేసుకుని నేటి ట్రెండ్‌కు తగినట్లు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు.