English | Telugu
మరోసారి కమల్ తో సిమ్రాన్
Updated : Feb 26, 2014
మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన "దృశ్యం" చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానున్న విషయం అందరికి తెలిసిందే. తెలుగులో వెంకటేష్, మీనా కలిసి నటించబోతున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్త కార్యక్రమాలు కూడా జరిగాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే తమిళ రీమేక్ లో కమల్ హాసన్ హీరోగా నటించనున్నారు. కమల్ సరసన సిమ్రాన్ ను ఎంపిక చేసారు. ఈ చిత్ర షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. మరి ఈ చిత్రాలు ఎలాంటి విజయం సాధిస్తాయో త్వరలోనే తెలియనుంది.