English | Telugu

ప్రెగ్నెన్సీతో వున్న పూర్ణను పరుగెత్తించిన డైరెక్టర్!


ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకే సినిమాలు ఉన్నాయి. వినోదం అయినా, యాక్షన్‌ అయినా.. మరేదైనా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు నటీనటులు కొన్నిసార్లు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఔట్‌ఫుట్‌ బాగా వచ్చేందుకు కొందరు నటీనటులు ఎంతో రిస్క్‌ చేస్తారు. వారు చేసిన సీన్స్‌ను ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నప్పుడు ఆ కష్టాన్ని మరచిపోతుంటారు. అలాంటి ఓ అనుభవాన్ని హీరోయిన్‌ పూర్ణ ప్రేక్షకులతో పంచుకుంది. నాని హీరోగా నటించిన ‘దసరా’ మూవీ షూటింగ్‌లో తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని షేర్‌ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్‌ మొత్తం తను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే పూర్తి చేసిందట.

ఎక్కువ సీన్స్‌ నైట్‌ ఎఫెక్ట్‌లోనే ఈ మూవీ డైరెక్టర్ చేశారని, అయితే ఆ చలిని తాను తట్టుకోలేకపోయానని చెప్పింది. రాత్రి టైమ్‌లోనే ఓ సీన్‌ చేస్తున్నప్పుడు నిర్మానుష్యమైన రోడ్డుపై పరిగెత్తాల్సి వచ్చిందని, అప్పుడు వీధి కుక్కలు వెంటపడ్డాయని, వాటి అరుపులకు భయపడ్డానని చెప్పింది. ఆ టైమ్‌లో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా చేసిన ఆ సీన్‌ తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది అంటూ ‘దసరా’ షూటింగ్‌ అనుభవాలను గుర్తు చేసుకుంది. గత ఏప్రిల్‌లో పూర్ణ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూసుకుంటూనే టీవీ షోల్లో, సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తోంది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు హీరోయిన్‌గా ఆశించినంత గుర్తింపు రాలేదు. సినిమాలనే నమ్ముకోకుండా కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .