English | Telugu

ఒక సినిమా మిస్‌ అయితేనేం.. మరో సినిమా ఇచ్చాడు

తమిళ సినిమా ‘మాస్క్‌’తో హీరోయిన్‌గా పరిచయమైన పూజా హెగ్డే ఆ తర్వాత తెలుగులో వరసగా ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ వెంటనే బాలీవుడ్‌ మూవీ ‘మొహెంజోదారో’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం రావడంతో ఎగిరి గంతేసి ముంబయ్‌కి వెళ్ళిపోయింది. ఆ సినిమా డిజాస్టర్‌ అవ్వడంతో ఎంత స్పీడ్‌గా వెళ్ళిందో అంతే స్పీడ్‌గా టాలీవుడ్‌కి వచ్చేసింది. ఇక అప్పటి నుంచి తెలుగులో వరసగా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఈ సంవత్సరం
హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో ‘కిసి కా భాయ్‌.. కిసీ కి జాన్‌’ చిత్రం తప్ప మరో సినిమా చెయ్యలేదు. ఇలాంటి సమయంలోనే త్రివిక్రమ్‌ తన సినిమాలో చేసే అవకాశం ఇచ్చాడు. ‘పుష్ప2’ తర్వాత బన్నితో త్రివిక్రమ్‌ చేసే సినిమాలో పూజా హీరోయిన్‌గా ఎంపికైంది.

వాస్తవానికి మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమాలో మొదట పూజా హెగ్డేనే హీరోయిన్‌గా ఓకే చేసుకున్నారు. సినిమా కాస్త డిలే అవ్వడంతో ఆమె డేట్స్‌ లేకుండా పోయాయి. ఆ టైమ్‌లోనే సల్మాన్‌ ఖాన్‌ సినిమా షూటింగ్‌లో ఉండడం వల్ల ‘గుంటూరు కారం’ చేసే ఛాన్స్‌ మిస్‌ అయింది. అయినా అదృష్టం ఆమె వెంటే ఉంది. త్రివిక్రమ్‌ తన నెక్స్‌ట్‌ సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో’ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన బన్ని, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పుడు నాలుగో సినిమా స్టార్ట్‌ కాబోతోంది. ‘దువ్వాడ జగన్నాథమ్‌, అల.. వైకుంఠపురములో’ చిత్రాల్లో బన్నితో జత కట్టిన పూజాకి ఇది హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. ‘పుష్ప2’, ‘గుంటూరు కారం’ తర్వాత బన్ని, త్రివిక్రమ్‌ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.