English | Telugu
అమ్మ బాబోయ్.. ఇది ప్రభాస్ బొమ్మనా!
Updated : Sep 25, 2023
మన దేశంలో సినిమా హీరో లని ఆరాధించినంత రేంజ్ లో దేవుళ్ళని కూడా ఆరాధించరేమో. అభిమానులు తమ అభిమాన కథానాయకుడు మీద ఉన్న అభిమానాన్ని రక రక రూపాల్లో వ్యక్తపరుస్తూ ఉంటారు. ఒక్కో హీరోకి లక్షల్లో అభిమానులు ఉంటారు. అలా లక్షల్లో అభిమానులని సంపాదించుకున్న ఒక హీరో ప్రభాస్. తెలుగు సినిమా హీరో రేంజ్ నుంచి పాన్ ఇండియా హీరో రేంజ్ కి ఎదిగిన నటుడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ మైనపు బొమ్మ ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఆ బొమ్మ చూసిన డార్లింగ్ అభిమానులు మా ప్రభాస్ ని అవమానించాలనే మైనపు బొమ్మ నెపంతో ట్రోల్ చేస్తున్నారని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
అదేంటి ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు చేస్తే అభిమానులు గర్వపడాలి గాని కోపంగా ఉండటం ఎందుకని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వస్తే కర్ణాటకలోని మైసూర్ లో ప్రభాస్ ఆకారంతో ఉన్న మైనపు బొమ్మ ఒక దాన్ని ఏర్పాటు చేసారు. కానీ బొమ్మని ఏర్పాటు చేసిన వాళ్ళు అభిమానంతో ఏర్పాటు చేసారా లేక ప్రభాస్ ని ట్రోల్ చేయ్యడానికి ఏర్పాటు చేసారా అని అర్ధం కావటం లేదు. ఎందుకంటే ఆ మైనపు బొమ్మ ప్రభాస్ లాగ లేదు. లాంగ్ లాంగ్ ఎగో లో వచ్చిన దుబాయి శ్రీను మూవీలోని విలన్ క్యారెక్టర్ పోషించిన నటుడి రూపం లో ఉంది. సోషల్ మీడియాలో డార్లింగ్ మైనపు బొమ్మని చూస్తున్న ఫాన్స్ అయితే మాత్రం, కావాలని మా రెబల్ స్టార్ ని ట్రోల్ చేస్తున్నారని ఒక రేంజ్ లో తిట్టి పడేస్తున్నారు. కొంత మంది ఫాన్స్ అయితే మాత్రం అసలు మా ప్రభాస్ అలా ఉంటాడా అని ఆశ్చర్యపోతోన్నారు. సోషల్ మీడియా లో ప్రభాస్ దిగా చెప్పబడుతున్న మైనపు బొమ్మ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంలోని యుద్ధవీరుడి గెటప్ లో ఉండటం గమనార్హం.