English | Telugu

ది స్కేరియస్ట్ ఫిల్మ్.. భయపెడుతున్న 'పిండం' ట్రైలర్!

శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్ చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. సాయికిరణ్ దైదాను దర్శకుడిగా పరిచయం చేస్తూ కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

పిండం ట్రైలర్ గురువారం ఉదయం విడుదలైంది. మూడున్నర నిమిషాలకు పైగా నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈశ్వరీ రావుతో "మరణం అనేది నిజంగానే అంతమా?. మరణించిన తరువాత ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా?. కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా?. ఆ ఆత్మలు మనకు నిజంగానే హని చేయగలవా?" అంటూ నిజ జీవితంలో కూడా ఎందరో తెలుసుకోవాలనుకునే ఆసక్తికర విషయాలను అవసరాల శ్రీనివాస్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమైంది. చాలా కాలంగా ఎవరూ నివసించని ఒక ఇంటిలోకి కథానాయకుడు శ్రీరామ్ కుటుంబం వస్తుంది. ఆ ఇంట్లో వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మ ఆ కుటుంబానికి నిద్ర కూడా లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి వచ్చిన ఈశ్వరీ రావు "మీ కుటుంబాన్ని వేధిస్తున్నది ఒక్క ఆత్మ కాదు" అని చెప్పడం మరింత ఉత్కంఠగా మారింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ నడిచింది. ఇక ప్రారంభంలో అవసరాల శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్నట్లుగా "ఒక వస్తువుని తగలబెట్టినా, నరికినా, పూడ్చినా అది అంతమైపోతుందని మనం భ్రమపడతాం. కానీ ఆ వస్తువులోని అంతర్గత శక్తిని, ఆ ఎనర్జీని మనం ఎప్పటికీ నిర్మూలించలేం. ఇది శాశ్వత సత్యం." అని ఈశ్వరీ రావు చెప్పిన మాటతో ట్రైలర్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది. ట్రైలర్ లో కెమెరా పనితనం కానీ, నేపథ్య సంగీతం కానీ హారర్ చిత్రానికి తగ్గట్టుగా అద్భుతంగా కుదిరాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే థియేటర్ లో ప్రేక్షకులు అసలైన హారర్ అనుభూతిని పొందడం ఖాయమనిపిస్తోంది.

'పిండం' అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అని, ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. మరి పిండం సినిమా నిజంగానే ప్రేక్షకులను ఆ స్థాయిలో భయపెడుతుందేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.