English | Telugu

అల్లు ఇంటికి పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి..?

అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. శనివారం నాడు సినీ, రాజకీయ ప్రముఖులు కనకరత్నమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించి.. అల్లు కుటుంబాన్ని పరామర్శించారు. అయితే వైజాగ్ లో నిన్న జనసేన సమావేశం ఉండటంతో.. పవన్ కళ్యాణ్ రాలేకపోయారు. (Allu Kanakaratnam)

వైజాగ్ సమావేశం ముగించుకొని హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్.. ఆదివారం నాడు అల్లు నివాసానికి వెళ్లి అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ లను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. (Pawan Kalyan)

మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ ఉందంటూ.. కొందరు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ పరామర్శించడం, ఆ ఫొటో బయటకు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎప్పటికైనా మెగా, అల్లు కుటుంబాలు ఒకటేనని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.