English | Telugu

పవన్‌కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా.. అనఫీషియల్ న్యూస్‌లో అనేక మార్పులు

- సల్మాన్‌ఖాన్‌తో వంశీ పైడిపల్లి మూవీ కన్‌ఫర్మ్?

- కొత్త సినిమాలపై నోరు విప్పని దిల్‌రాజు

- పవన్ కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా ఉందని ఎవరు చెప్పారు

గత కొన్నిరోజులుగా పవన్‌ కళ్యాణ్‌తో దిల్‌ రాజు ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొదట ఈ సినిమాకి అనిల్‌ రావిపూడిని దర్శకుడిగా ఎంపిక చేసినట్టు టాక్‌ నడిచింది. ఆ తర్వాత ఆ ప్లేస్‌లోకి వంశీ పైడిపల్లిని తీసుకొని ఆ వార్తను సర్క్యులేట్‌ చేశారు. అయితే ఈ రెండు వార్తలూ అధికారికం కాదు. దిల్‌రాజుగానీ, ఆయా డైరెక్టర్లు గానీ ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కేవలం ప్రచారం జరుగుతున్న వార్తల్లోనే పలు మార్పులు చోటు చేసుకోవడం విచిత్రంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో హిందీ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందనేది ఆ వార్త.

Also Read:దీపికపై ‘కల్కి’ టీమ్‌ కక్ష సాధింపు.. అది చిన్నపిల్లల చర్య అంటూ విమర్శలు!

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి స్థానంలో వంశీ పైడిపల్లిని తీసుకున్నారంటూ న్యూస్‌ వచ్చింది. అయితే ఇవేవీ అధికారికంగా ప్రకటించిన వార్తలు కాదు. కానీ, ఈ ఊహాగానాల్లోనే పలు మార్పులు, చేర్పులు చేస్తూ న్యూస్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారు.

Also Read:ఘనంగా జరిగిన అల్లు శిరీష్, నైనికా ఎంగేజ్మెంట్.. మెగా హైలెట్స్ ఇవే

ఇప్పుడు తాజాగా సల్మాన్‌ ఖాన్‌తో వంశీ పైడిపల్లి సినిమా చేయబోతున్నాడని, ఆ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తారని చెప్పుకుంటున్నారు. సల్మాన్‌కి వంశీ కథ చెప్పడం, అది ఓకే అవ్వడం కూడా జరిగిపోయిందనేది ప్రచారంలో ఉన్న వార్త. దీన్నిబట్టి పవన్‌కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా లేదు అని కూడా చెప్పుకుంటున్నారు. తన కాంపౌండ్‌లో ఉన్న డైరెక్టర్లతోనే దిల్‌రాజు సినిమాలు చేస్తారన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తను చెప్పినట్టు వినే డైరెక్టర్లకే దిల్‌రాజు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తారు. అందుకే అతని ప్రొడక్షన్‌లో డైరెక్టర్లు రిపీట్‌ అవుతూ ఉంటారు.

Also Read:నాని సినిమాలో హాలీవుడ్ అగ్ర హీరో!

ఆ విధంగానే ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హిందీ సినిమా చేయబోతున్నారని సమాచారం. మరో పక్క ఓజీ2 చిత్రం నుంచి డి.వి.వి.దానయ్య తప్పుకున్నాడని, ఆ సినిమాను కూడా దిల్‌రాజే నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దిల్‌రాజుకు సంబంధించిన ఈ ప్రాజెక్టుల విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం వీటి గురించి రకరకాల వార్తలు సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఏది ఏమైనా దిల్‌రాజు తను చేయబోయే సినిమాల వివరాలను అధికారికంగా ప్రకటించే వరకు దేన్నీ నమ్మే పరిస్థితి లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.