English | Telugu
చిరంజీవికి ఆపరేషన్ జరిగిందా?
Updated : Jul 26, 2023
మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసు దాటినా కుర్ర హీరోలకు గట్టిపోటీనే ఇస్తున్నారు. వరుస సినిమాలు చేయటమే కాదు, డాన్సులు, యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పిస్తున్నారు. రీసెంట్‌గానే భోళా శంకర్ సినిమాను పూర్తి చేసిన సతీమణి సురేఖతో కలిసి అమెరికా వెళ్లి వచ్చారు. వెకేషన్ వెళ్లి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ చిన్న ఆపరేషన్ కోసం వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే, కొన్నాళ్లుగా ఆయన మోకాళి నొప్పితో బాధపడుతున్నారు. అందుకనే ఆయన అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ఇందులో టెన్షన్ పడేంత ఏమీ లేదని, అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన నడుచుకుంటూనే వెళ్లారని నెటిజన్స్ అంటున్నారు.
త్వరలోనే చిరంజీవి తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను చిరంజీవి కుమార్తె సుష్మిత, అల్లుడు విష్ణు ప్రసాద్‌లతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా కలిసి నిర్మిచనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని త్వరలోనే సినిమాను లాంఛనంగా సెట్స్ పైకి తీసుకెళ్లటమే కాకుండా వెంటనే షూటింగ్‌ను స్టార్ట్ చేసేస్తారని, ఇప్పటికే ప్లానింగ్ పూర్తి కావటంతో వీలైనంత త్వరగానే సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. అందుకు కారణం.. వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుంటే మరో జంట కూడా సందడి చేయనుందని సమాచారం.
మరో వైపు ఆగస్ట్ 11న చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమా రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను రూపొందిస్తోంది.