English | Telugu
మళ్ళీ లొల్లి షురూ చేసింది
Updated : Feb 10, 2014
రోజు రోజుకి సమంత తీరు మితిమీరిపోతుంది. మొన్న మహేష్ నటించిన "1" చిత్ర పోస్టర్ గురించి రచ్చ చేసింది. అయితే తాజాగా కోలీవుడ్ లో కూడా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న "అంజాన్" లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. అందులో కేవలం సూర్య ఫోటో మాత్రమే ఉండటం వల్ల మళ్ళీ తన తిక్కతో పెద్ద చర్చకి తెరలేపింది. ఈ విషయంపై సమంత ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..."ఈ ఫీల్డ్‌లో హీరోలదే డామినేషన్ ఎక్కువ. దానికి సూర్య కూడా అతీతుడు కాడని తేలిపోయింది. స్త్రీలకు సినీ పరిశ్రమలో సమగౌరవం లభిస్తుందనడం అసత్యం. "అంజాన్" చిత్రం ఫస్ట్‌లుక్‌లో నా ఫొటో లేకపోవడమే అందుకు పెద్ద నిదర్శనం" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తుంది. మరి ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది.