English | Telugu

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ప్రీమియర్లు.. ఒక్కో టికెట్ ఎంతంటే..?

మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర 'ఓజీ' తుఫాను చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ నటించిన ఈ గ్యాంగ్ స్టర్ మూవీ, సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మోస్ట్ హైప్డ్ మూవీ ఇదే అని చెప్పవచ్చు. 'ఓజీ' నుంచి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసి, సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని.. పవన్ అభిమానులతో పాటు ట్రేడ్ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చరిత్ర సృష్టిస్తుందని బలంగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. (They Call Him OG)

సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన 'ఓజీ'పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, సినీ ప్రియులంతా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎక్సైట్ అవుతున్నారు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా.. మేకర్స్ తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల నుంచి ఇరు రాష్ట్రాలలో షోలు ప్రదర్శించే ఆలోచనలో ఉన్నారట. టికెట్ ధర రూ.1000 ఉండే అవకాశముంది అంటున్నారు.

'ఓజీ' ప్రీమియర్ షోలకు ఆంధ్రప్రదేశ్ లో అనుమతి లభించడం లాంఛనమే. తెలంగాణలో కూడా 'హరి హర వీరమల్లు' తరహాలో అనుమతి లభించే ఛాన్స్ ఉంది. అదే జరిగి రెండు తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ పడితే.. ఓపెనింగ్స్ పరంగా 'ఓజీ' సృష్టించే రికార్డుల గురించి కొన్నేళ్లు మాట్లాడుకుంటారు అనడంలో సందేహం లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.