English | Telugu

నీదా, నాదా లేక మనదా!.. సినిమా రంగంలో ఏమైనా జరగవచ్చు

దర్శకధీరుడు 'రాజమౌళి'(Ss Rajamouli)ఒక వైపు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'గీతా ఆర్ట్స్' అధినేత 'అల్లు అరవింద్'(Allu Aravind)ఒక వైపు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'మగధీర', సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, రాజమౌళి పాన్ ఇండియా సినిమా ఐడియాలజీకి మూలంగా కూడా 'మగధీర' నిలిచింది. 'గీతా ఆర్ట్స్' సంస్థలో కూడా 'మగధీర' ముందు వరకు నిర్మించిన చిత్రాలు ఒక ఎత్తయితే, మగధీర ఒక్కటే ఒక ఎత్తు. ఆ తర్వాత ఇద్దరి కాంబోలో ఎలాంటి చిత్రం రాలేదు.

భారతీయ ఇతిహాసంలో 'మహాభారతం'(Mahabharata)ఒక దృశ్య కావ్యం. ఈ దృశ్య కావ్యాన్ని ఒక విసృతమైన పరిధిలో తెరకెక్కించడానికి 'గీతా ఆర్ట్స్' తన సన్నాహాలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ కొంత‌మంది ర‌చ‌యిత‌ల‌తో 'ప్రీ ప్రొడక్ష‌న్ వ‌ర్క్' ని ప్రారంభించినట్టుగా కూడా సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. భారతదేశంలోని అన్ని భాషల్లో 'మహాభారతం'పై ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత చిత్రాలకి భిన్నంగా 'మ‌హాభార‌తాన్ని 'అర్జునుడి'కోణంలో చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మ‌హాభార‌తం' పై ఇప్పటి వరకు వ‌చ్చిన పుస్త‌కాలు, సినిమాలు, అందులో చ‌ర్చించిన విష‌యాలని రీసెర్క్ చేయ‌డానికి ఒక టీమ్ ప‌ని చేస్తుందనే మాటలు కూడా వినపడుతున్నాయి. అర్జునుడిగా 'అల్లుఅర్జున్'(Allu Arjun)క‌నిపించే అవ‌కాశం ఉందనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే జరిగితే మహాభారతం సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ గా మారుతుందో తెలిసిన విషయమే. ఇతర క్యారెక్టర్లలో పాన్ ఇండియా స్టార్లు క‌నిపించే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.

రాజమౌళికి కూడా 'మ‌హాభార‌తం' ని ఐదు భాగాలుగా సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావాలనేది అతి పెద్ద డ్రీం. ఈ విషయాన్నీ బహిరంగంగానే చాలా సార్లు వెల్లడి చేసాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు(Mahesh Babu)తో అడ్వెంచర్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ చిత్రం 2027 లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. దీని తర్వాత రాజమౌళి మహాభారతానికి సంబందించిన పనులని ప్రారంభించాలి. ఒక వేళ రచయిత వాళ్ళ నాన్న 'విజయేంద్రప్రసాద్' నే కాబట్టి, కథ పనులు త్వరగానే పూర్తయినా,ప్రీ ప్రొడ‌క్ష‌న్ కి చాలా టైం నే పడుతుంది. ఈ లోపు గీతా ఆర్ట్స్ మహాభారతం పనుల్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'గీతా ఆర్ట్స్' ముందుగా 'మహాభారతాన్ని' ప్రారంభించవచ్చు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించే 'మహాభారతం' ప్రత్యేక ఆకర్షణగా నిలవవచ్చు. సినీ సర్కిల్స్ లో ఇంకో న్యూస్ కూడా వినపడుతుంది. రాజ‌మౌళి కోసమే మహాభారతం వర్క్ ని గీతా ఆర్ట్స్ సంస్థ ప్రారంభించిందని అంటున్నారు. అల్లు అర్జున్, రాజమౌళి కాంబో తెరపైకి తీసుకురావాలని అల్లు అరవింద్ గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసాడు. కానీ కుదరలేదు. ఆ లోటుని 'మ‌హాభార‌తం'తో తీర్చాలనే అల్లు అరవింద్ మహాభారతాన్ని తయారు చేస్తున్నాడనే టాక్ . కాబట్టి గీతా ఆర్ట్స్ లో మ‌హాభార‌తానికి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు కొట్టిపారేయ‌లేం. ఎందుకంటే సినిమా రంగంలో ఏమైనా జరగవచ్చు. రాజమౌళి సూచనల మేరకే అల్లు అర్జున్ పుష్ప ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చెయ్యడం, పుష్ప 2 తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించడం తెలిసిందే.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం