English | Telugu
నవంబర్ 18 న ఎన్టీఆర్ మూవీ రిలీజ్
Updated : Oct 2, 2023
ఎన్టీఆర్ అండ్ వివి వినాయక్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఒక్కసారి తెలుగు సినిమా రికార్డులకు సంబంధించిన పేజీల్లో చెక్ చేసుకోవచ్చు .ఆ ఇద్దరి కలయికలో వచ్చిన ఆది,సాంబ .అదుర్స్ మూవీలు ఘన విజయం సాధించి ఎన్టీఆర్ అండ్ వినాయక్ కాంబినేషన్ కి అభిమానుల్లో విపరీతమైన అంచనాలని పెంచాయి.ఇప్పుడు వీళ్ళద్దిరి కలయికలో రూపుదిద్దుకున్న మూవీ నవంబర్18 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కి సిద్ధం అయ్యి ఎన్టీఆర్ అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తెచ్చింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించి తన నట విశ్వరూపాన్ని సిల్వర్ స్క్రీన్ కి రుచి చూపించిన సినిమా అదుర్స్ .హిట్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో చారి,నర్సింహా అనే పాత్రల్లో ఎన్టీఆర్ నటనలో డాన్సుల్లో ఫైట్ ల్లో వీరవిహారం చేసాడు. మరి ముఖ్యంగా చారి పాత్రలో జీవించడమే కాకుండా అచ్చం వైష్ణవ ఆచారాలని పాటించేవాళ్ళు ఎలాగైతే మాట్లాడతారో అలాగే మాట్లాడుతూ ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పిన తీరు నిజం గా సూపర్.13 సంవత్సరాల క్రితం వచ్చిన అదుర్స్ మూవీ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకి కూడా విపరీతంగా నచ్చింది.అలాగే ఈ మూవీలో ఎన్టీఆర్ అండ్ బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే ప్రేక్షకులని థియేటర్ లో నవ్వులు పూయించింది. ఇద్దరు తమ క్యారక్టర్ ల ప్రకారం సీరియస్ గానే నటిస్తుంటారు .కానీ ప్రేక్షకులకి మాత్రం వాళ్ళ సీరియస్ నెస్ తమ సీట్ల లో కింద పడి మరి నవ్వేలా చేస్తుంది. నేటికీ చాలా మంది యు ట్యూబ్స్ లో అదుర్స్ సినిమా చూస్తూ కామెడీ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారంటే సినిమా ఎంతగా అడియన్సు మదిలో స్థానం సంపాదించిందో అర్ధం అవుతుంది.
ఇంక అసలు విషయానికి వస్తే అదుర్స్ సినిమా ఎన్టీఆర్ అభిమానులు అండ్ సినీ అభిమానుల కోరిక మేరకు నవంబర్ 18 న మరో సారి విడుదల కాబోతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తమ హడావుడిని మొదలుపెట్టారు.సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని తెలియపరుస్తున్నారు .ఎప్పడెప్పుడు నవంబర్ మంత్ వస్తుందా అదుర్స్ మూవీ ని వెండితెర మీద ఎప్పుడు చూస్తామా అని ఉవ్విళ్లూరుతున్నారు.అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగత సారధ్యం లో వచ్చిన ఆల్ సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్.నయన తార ,షీలా హీరోయిన్ లు గా నటించారు.