English | Telugu
హరి హర వీరమల్లు విషయంలో పవన్ అభిమానుల ఆందోళన
Updated : Oct 2, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా హిట్ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో భారీ చిత్రాల నిర్మాత ఏ.ఎం రత్నం నిర్మాతగా పవన్ కెరియర్ లో నే అత్యంత భారీ బడ్జెక్టు తో రూపుదిద్దుకుంటున్న సినిమా హరి హర వీరమల్లు..ఈ మూవీ మొదలైనప్పటి నుంచి పవన్ అభిమానులు మూవీ మీద భారీ అంచాలనే పెట్టుకున్నారు.ఇప్పుడు ఈ మూవీ కి సంబంధించిన ఒక వార్త పవన్ ఫాన్స్ ని ఆందోళనకి గురి చేస్తుంది.
పవన్ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా హరి హర వీర మల్లు.అలాగే మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం కూడా. రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ కొన్ని షెడ్యూల్స్ ని కూడా పూర్తిచేసుకుంది. అలాగే సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ గురించి రిలీజ్ చేసిన కొన్ని పిక్స్ కూడా ఫాన్స్ తో పాటు సినీ అభిమానుల్లో సినిమా మీద అంచనాలని పెంచేలా చేసింది.ఎప్పుడుడెప్పుడు వీరమల్లుని తెర మీద చూస్తామో అని అందరు ఎదురుచూసారు.కానీ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది.హరి హర తర్వాత షూటింగ్ జరుపుకున్నపవన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ వీరమల్లు మాత్రం లేట్ అవుతూ వస్తుంది.
ఇప్పుడు ఈ సినిమా గురించి తాజాగా వినపడుతున్న కథనాల ప్రకారం హరి హర వీరమల్లు కి పవన్ కళ్యాణ్ నవంబర్ నెలలో డేట్స్ ఇచ్చాడనే మాట వినపడుతుంది.కాని అది కుదరకపోవచ్చని కొందరు అంటున్నారు.ఎందుకంటే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ గా ఉన్నాడు .తన వారాహి యాత్ర తదుపరి టూర్ కూడా ఖరారు అయ్యింది.పైగా వచ్చే సాధారణ ఎన్నికలకి ఇంక ఏడాది టైం మాత్రమే ఉంది.హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కి కుదిరినప్పుడు షూటింగ్ జరుగుతుంది.మరి హరి హర వీర మల్లు షూటింగ్ కి ఎప్పుడు మోక్షం లభిస్తుందో ఎప్పుడు విడుదల అయ్యి అభిమానుల దాహాన్ని తీరుస్తుందో చూడాలి.