English | Telugu

మరో బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్! ఈ సారి ఆ సూపర్ స్టార్ తో కలిసి!


-ఈ న్యూస్ నిజమేనా!
-ఎవరు ఆ సూపర్ స్టార్
-ఎన్టీఆర్ ఒప్పుకున్నాడా!

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ తెలిసిందే. ఎలాంటి క్యారక్టర్ నైనా అవలీలీలగా పోషించే ఎన్టీఆర్ సదర్ క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం యాదుండేలా చెయ్యడంలో తిరుగులేని మిసైల్. ప్రీవియస్ స్పై యాక్షన్ మూవీ 'వార్ 2'(War 2)నే రీసెంట్ ఉదాహరణ. ఆశించినంత స్థాయిలో ఫలితం రాకపోయినా ఎన్టీఆర్ పెర్ ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఇందుకు బాలీవుడ్ మేకర్స్, క్రిటిక్స్ ,ప్రేక్షకులు అతీతులేమి కాదు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మరో హిందీ సినిమాలో చేయబోతున్నాడనే వార్తలు ఒక రేంజ్ లోనే హల్ చల్ చేస్తున్నాయి.

వార్ 2 ని సుదీర్ఘ చరిత్ర కలిగిన 'యష్ రాజ్'(Yash Raj)సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సంస్థనే 2023లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah rukh Khan)తో స్పై థ్రిల్లర్ జోనర్ లోనే 'పఠాన్' అనే మూవీని నిర్మించింది. షారుక్ ని వరుస పరాజయాల నుంచి గట్టెక్కించిన పఠాన్ ఏకంగా 1000 కోట్లకి పైగా రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ని తెరకెక్కించే ఆలోచనలో యష్ రాజ్ ఉన్నట్టుగా టాక్. ఆలోచనలో ఉండటమే కాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసినట్టుగా బి టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ లోనే ఎన్టీఆర్ ని కూడా షారుక్ తో కలిసి చేయించాలనే పట్టుదలతో యష్ రాజ్ ఉన్నట్టుగా క్రిటిక్స్ చెప్తున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ ని సంప్రదించారనే టాక్ కూడా జోరుగానే వినపడుతుంది.


Also read:భార్యకి క్యాన్సర్, నాలుగు సర్జరీలు.. రియల్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్న షరీబ్‌

ఇంకొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలైతే స్పై యూనివర్స్ లో భాగంగా యష్ రాజ్ ఆ తరహా చిత్రాలని ఎక్కువగా నిర్మిస్తోంది. అంతే కాకుండా వాళ్ళు తెరకెక్కించిన సినిమాలని మరో మూవీకి లింక్ చేస్తున్నారు. ఈ కోవలోనే ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్(Salman Khan)'టైగర్' గా గెస్ట్ క్యారక్టర్ లో కనపడ్డాడు. ఈ కోవలోనే ఎన్టీఆర్ కూడా వార్ 2 లో పోషించిన మేజర్ రఘు విక్రమ్ చలపతి గా పఠాన్ 2 లో గెస్ట్ గా కనిపిస్తాడనే విషయాన్నీ చెప్తున్నారు. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో వెయిట్ చేస్తే గాని తెలియదు.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .