English | Telugu

హనీమూన్ ట్రిప్పులో యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతి

హనీమూన్ ట్రిప్పులో యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతి ఉన్నారని ఫిలిం నగర్ వర్గాల కథనం. వివరాల్లోకి వెళితే మే 5 వ తేదీన రాత్రి 2.41 గంటలకు అంగ రంగ వైభవంగా జరిగింది. అనంతరం నూతన వధూవరులు పసుపు బట్టలతో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత జరిగే సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పెద్దల మాట ప్రకారం ఆచరించిన మీదట యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతి తేనె చంద్రుడి కోసం వెళుతున్నారు. అర్థం కాలేదా...? అదేనండీ హనీమూన్ ట్రిప్పు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరు పది రోజుల హనీమూన్ కోసం మారిషస్ కు వెళ్ళనున్నారు.

మారిషస్ వాతావరణం ఈ కొత్త జంటకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఎటుచూసినా పచ్చటి పర్వతాలూ, చక్కని స్పష్టమైన నీళ్ళతో నీలపు సముద్రపు బీచ్ లూ, వాతావరణం అసలు చమట పట్టనివ్వదు. అంటే హ్యూమిడిటీ ఉండదు. అక్కడంతా చల్లని ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అలా ఉంటుందనే తమ హనీమూన్ కోసం మారిషస్ ని ఎంచుకున్నారు యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతి. హనీమూన్ నుండి రాగానే సురేంద్ర రెడ్డి సినిమా పూర్తి చేస్తూనే, బోయపాటి దర్శకత్వంలోని సినిమాలో కూడా యన్ టి ఆర్ నటిస్తారని సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.