English | Telugu
విజయ్ దేవరకొండతో సామ్ లైవ్ పెర్ఫామెన్స్
Updated : Aug 15, 2023
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సెప్టెంబర్ 1న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఇటు విజయ్ దేవరకొండ, అటు సమంత ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. లైగర్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతామని ఆశపడ్డ విజయ్ దేవరకొండకు ఆ సినిమా షాక్ ఇచ్చింది. దీంతో తను ఖుషి సినిమా సక్సెస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. మరో వైపు సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండటానికి నిర్ణయించుకుంది. ఆమెను ఫ్యాన్స్, ప్రేక్షకులు మరచిపోకూడదని అనుకుంటే 'ఖుషి' సినిమా హిట్ కావాల్సిందే.
'ఖుషి' మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. సెప్టెంబర్ 1న విడుదలంటే రెండు వారాల వ్యవధి మాత్రమే. దీంతో ఎంటైర్ యూనిట్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, సమంత ఇంటర్వ్యూను కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్తొకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. 'ఖుషి' సినిమా మ్యూజికల్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, సమంత కలిసి లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారట. నిజంగా స్టేజ్‌పై ఈ జోడీ పాటకు డాన్స్ వేస్తే.. అది సోషల్ మీడియాలో ఓ రేంజ్‌గా వైరల్ అవుతుందనే సంగతి తెలిసిందే.
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి మధ్య వచ్చే మనస్పర్ధలకు కారణాలేంటనే పాయింట్‌తో 'ఖుషి' సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.