English | Telugu

'గాండీవధారి అర్జున'.. మరీ అంత తక్కువా

'గద్దలకొండ గణేశ్' తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి సాలిడ్ హిట్ లేదు. గత ఏడాది జనం ముందుకొచ్చిన 'గని', 'ఎఫ్ 3' ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. 'గాండీవధారి అర్జున' ఫలితం కీలకంగా మారింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సెక్యూరిటీ ఆఫీసర్ గా సరికొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు వరుణ్ తేజ్.

కాగా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ 'యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. అలాగే.. 2 గంటల 16 నిమిషాల నిడివితో జనం ముందుకు రానుంది. రన్ టైమ్ పరంగా చూస్తే.. ఇది తక్కువ నిడివి అనే చెప్పాలి. మరి ఈ క్రిస్పీ రన్ టైమ్ 'గాండీవధారి అర్జున'కి ప్లస్ అవుతుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే, 'గాండీవధారి అర్జున'లో వరుణ్ తేజ్ కి జంటగా సాక్షి వైద్య నటిస్తోంది. నాజర్, వినయ్ రాయ్, విమలా రామన్, మనీష్ చౌదరి, రవి వర్మ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు అందించారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.