English | Telugu
మంచు మనోజ్‌ను పక్కన పెట్టిన నిహారిక కొణిదెల.. ఎలా?
Updated : Dec 19, 2023
2004లో వచ్చిన ‘దొంగ దొంగది’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ 2017 వరకు తన కెరీర్‌ను కొనసాగించి పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. అతను చివరగా చేసిన సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. ఆ తర్వాత ‘అహం బ్రహ్మస్మి’ పేరుతో ఓ సినిమా చేస్తున్న ప్రకటించాడు. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. అయితే పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టారని తెలుస్తోంది. ఆమధ్య ‘వాట్ ద ఫిష్’ అనే చేస్తున్నట్టు ప్రకటించాడు మనోజ్. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుందని, అది తనకు రీ ఎంట్రీ సినిమా అవుతుందని ఎనౌన్స్ చేశాడు. ఇది జరిగి చాలా కాలమైంది. అయినా ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘వాట్ ద ఫిష్’ చిత్రం నుంచి నిహారిక కొణిదెల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాతో నిహారిక సిల్వర్ స్క్రీన్‌పై కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌లో, ట్వీట్స్‌లో ఎక్కడా మంచు మనోజ్ పేరు కనిపించలేదు. అలాగే నిహారిక ఫస్ట్‌లుక్‌ను మనోజ్ షేర్ చేయలేదు. దీన్నిబట్టి ‘వాట్ ద ఫిష్’ చిత్రం నుంచి మంచు మనోజ్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మనోజ్ చెయ్యాలనుకున్న క్యారెక్టర్ నిహారిక చేయబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అష్టలక్ష్మి అలియాస్ ఎస్‌హెచ్ పాత్రలో నిహారిక కనిపించబోతున్నట్లు టీమ్ ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నిహారిక గ్లామర్ లుక్‌లో కనిపిస్తోంది. ఆమె వెనుక డాలర్ సింబల్ ఉండటం ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి వరుణ్ కోరుకొండ దర్శకుడు. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీత దర్శకుడు. 2019లో రిలీజైన ‘సూర్యకాంతం’ తర్వాత నిహారిక కొణిదెల నటిస్తోన్న సినిమా ఇదే. ఈ సంవత్సరంలోనే ‘డెడ్ పిక్సల్స్’ పేరుతో వచ్చిన వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది నిహారిక.