English | Telugu

‘కాంతార2’ మూవీ క్రేజీ అప్‌డేట్స్‌

గ‌త ఏడాది ఎలాంటి అంచ‌నాలు లేకుండా మినిమం బ‌డ్జెట్‌తో రూపొంది ఏకంగా రూ. 450 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి అంద‌రినీ త‌న‌వైపు తిప్పుకునేలా చేసిన క‌న్న‌డ‌ సినిమా ‘కాంతార’. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ రాబోతున్న సంగ‌తి విదిత‌మే. ‘కాంతార 2’ పేరుతో ఈ ప్రీక్వెల్‌ను రూపొందించ‌టానికి కావాల్సిన స‌న్నాహాల‌న్నీ జ‌రుగుతున్నాయి. రిష‌బ్ శెట్టి చాలా రోజుల నుంచి ఈ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నారు. న‌వంబ‌ర్ నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని శాండిల్ వుడ్ స‌ర్కిల్స్ అంటున్నారు. హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను ఏకంగా రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ ప్రీక్వెల్‌ను నిర్మించ‌నుంది.

కాంతార సాధించిన సునామీ ఎఫెక్ట్ కార‌ణంగా ‘కాంతార 2’పై ఎలాంటి ఎక్స్‌పెక్టెష‌న్స్ ఉంటాయ‌నే విష‌యం రిష‌బ్ శెట్టి అర్థం చేసుకున్నారు. అందుక‌నే ఈ ప్రీక్వెల్‌పై బాగా క‌సర‌త్తులు చేసి సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. అందులో భాగంగా ప్ర‌తీ విష‌యంలోనూ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. తాజాగా ఈ ప్రీక్వెల్‌కు సంబంధించి మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వైర‌ల్ అవుతున్నాయి. అవేంటంటే ప్రీక్వెల్ క‌థ 301 AD జ‌న‌వ‌రి 1 నుంచి ప్రారంభ‌మైన 31 Dec 400 AD వ‌ర‌కు జ‌రుగుతుందని టాక్ వినిపిస్తోంది. కాంతార 2 కోసం రిష‌బ్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. క్యారెక్ట‌ర్ కోసం ఏకంగా 11 కిలోల బ‌రువు త‌గ్గార‌ని స‌మాచారం. నాలుగో శ‌తాబ్దంలో న‌డిచే ఈ క‌థ‌ను తెర‌కెక్కించ‌టానికి ప్ర‌త్యేక‌మైన సెట్స్ కూడా సిద్ధం చేస్తున్నారు మేక‌ర్స్ హోంబ‌లే ఫిలింస్.

‘కాంతార 2’ సినిమా ను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. భారీ అంచ‌నాల‌తో రూపొంద‌బోయే ‘కాంతార 2’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే మ‌రి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.