English | Telugu
ప్రేమికుల రోజున నయనతార పోస్టర్
Updated : Feb 13, 2014
తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రాన్ని మురుగదాస్ తెలుగులోనూ స్వయంగా రిలీజ్ చేస్తున్నాడు ''రాజా -రాణి '' పేరుతో . దర్శకుడు మురుగదాస్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై అట్లీ అనే కుర్రాన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన ఈ చిత్రం తమిళనాట ఘనవిజయం సాధించింది . ఈ సినిమా కోసం పలువురు పోటీ పడినప్పటికీ ఎవరికీ ఇవ్వకుండా తెలుగులో డబ్ చేస్తున్నాడు మురుగదాస్ . ఆర్య ,నయనతార ,జై , నాజ్రియ నజీమ్ హీరో హీరోయిన్ లు గా నటించిన ఈ చిత్ర టీజర్ ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారు . సినిమాని ఈ నెలాఖరున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .