English | Telugu
జీవా, ఆర్యల రంగం మొదలైంది
Updated : Feb 13, 2014
తమిళంలో జీవా హీరోగా, ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఓ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులోకి "రంగం మొదలైంది" పేరుతో అనువదిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు చెన్నైలో జరుగుతున్నాయి. ఎ.ఎం.రవితేజ సమర్పణలో లక్ష్మీ వాసంతీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అడ్డాల వెంకటరావు, వి.ఎం.సుందరం నిర్మాతలుగా ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. యుత్ ని ఆకట్టుకొనే కలర్ ఫుల్ ట్రయాంగిల్ ప్రేమకథా చిత్రం ఇది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ చిత్రానికి రాజేష్ దర్శకత్వం వహించాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.