English | Telugu
నవీన్ పోలిశెట్టి, శ్రీలీల సినిమా ఆగిపోయింది!
Updated : Aug 31, 2023
నవీన్ పోలిశెట్టి, శ్రీలీల జంటగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'అనగనగా ఒక రాజు' అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతేడాది రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది.
గతేడాది కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ప్రకటించిన 'అనగనగా ఒక రాజు' చిత్రాన్ని పక్కన పెట్టి.. సైలెంట్ గా అదే దర్శకుడితో మరో చిత్రాన్ని మొదలుపెట్టింది సితార. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'మ్యాడ్' అనే పెట్టడమే కాకుండా, తాజాగా టీజర్ ని కూడా విడుదల చేసి సర్ ప్రైజ్ చేసింది. మరి ప్రచారం జరుగున్నట్లుగా 'అనగనగా ఒక రాజు' నిజంగానే ఆగిపోయిందా లేక 'మ్యాడ్' తర్వాత దానిని పూర్తి చేస్తారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు' వంటి విజయవంతమైన సినిమాలతో హీరోగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన నవీన్ కి ఆ తర్వాత లక్ అంతగా కలిసి రావడం లేదనే చెప్పాలి. అనుష్కతో కలిసి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బాగా అలస్యమవుతూ వచ్చి, ఇన్నాళ్ళకు సెప్టెంబర్ 7న విడుదలకు సిద్ధమైంది. గతేడాది ప్రకటించిన 'అనగనగా ఒక రాజు' సంగతి ఏమైందో తెలియడంలేదు.