English | Telugu
చిరంజీవి మెగాస్టార్ ఎలా అయ్యారో తెలుసంటున్న నాని
Updated : Dec 4, 2023
నాచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ 7 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీ గా ఉన్నాడు. పలు ఛానల్స్ కి వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తున్న నాని తాజాగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
నానితో ఒక విలేకరి మీ గత చిత్రం దసరా ఫుల్ మాస్ మూవీ. ఇప్పుడు మీరు చేస్తున్న హాయ్ నాన్న ఫుల్ క్లాస్ మూవీ. మీరు ఈ సినిమానే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని అడిగాడు. దీంతో నాని చిరంజీవి గారు ఖైదీ లాంటి మాస్ సినిమా చేసిన తర్వాత మళ్ళీ అలాంటి మాస్ సినిమాలే చెయ్యలేదుగా అఫ్ కోర్స్ మాస్ సినిమాలకి చిరు గారు పెట్టింది పేరు కానీ ఆయన అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేసారు కదా అని చెప్పాడు. అలా చెయ్యబట్టే ఆయన అన్ని వర్గాల వారికి అభిమాన కధానాయకుడుగా మారారు. అందుకే ఆయన సినీ ప్రయాణం చాలా గొప్పగా సాగి మెగాస్టార్ అయ్యారని నాని చెప్పాడు. పైగా నా అభిమానులు కూడా నా నుంచి ఒక జోనర్ లోనే సినిమాలు వస్తాయని కూడా ఫిక్స్ అవ్వలేదని చెప్పాడు. ఇదంతా చిరంజీవి గారితో నన్ను నేను పోల్చుకొని చెప్పడం లేదు. కేవలం ఒక ఉదాహరణగా చెప్పానంతే అని కూడా నాని అన్నాడు.
పైగా తన సినీ జర్నీ గురించి కూడా నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. నా సినీ కెరీర్ మొత్తం మీద నేను ఎప్పుడు కూడా పెద్ద స్టార్‌ని అవ్వాలని కోరుకోలేదు. తెర మీద నేను పోషించిన పాత్రలని ప్రేక్షకులు తమ జీవితాంతం గుర్తుంచుకుంటే చాలు. అలాగే ఆ చిత్రాలు నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలుగా కూడా మిగిలిపోవాలి అని నాని తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.