English | Telugu

శివ‌రాజ్‌కుమార్‌ని జ‌స్ట్ ట‌చ్ చేసిన శింబు

శివ‌రాజ్‌కుమార్, శ్రీ ముర‌ళి, శాన్వి శ్రీవాస్త‌వ‌, మ‌ధు గురుస్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన క‌న్న‌డ సినిమా మ‌ఫ్టి. న‌ర్త‌న్ ఈ సినిమాకు డైర‌క్ష‌న్ చేశారు. కంప్లీట్ గా యాక్ష‌న్ ఓరియంటెడ్ మాస్ సినిమా ఇది. ఈ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కింది శింబు న‌టించిన పత్తుత‌ల‌. త‌మిళంలో ప‌త్తుత‌ల సినిమాను తెర‌కెక్కిస్తున్నారు కృష్ణ‌. శింబు, గౌత‌మ్ కార్తిక్ కీ రోల్స్ చేశారు. ప్రియా భవానీ శంక‌ర్ నాయిక‌గా న‌టించారు. మార్చి 30న విడుద‌ల కానుంది ప‌త్తు త‌ల‌. ఈ చిత్రం టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. చూసిన వారంద‌రూ న‌ర్త‌న్ సినిమా మ‌ఫ్టీలాగా ఉంద‌ని అన్నారు. దాని గురించి ద‌ర్శ‌కుడు కృష్ణ మాట్లాడుతూ ``ఈ సినిమాను దాదాపు రెండేళ్ల‌కు పైగా తెర‌కెక్కించాం.

ఇన్నాళ్లుగా ఈ సినిమా మీద క్రేజ్ పెంచుకుంటూ వ‌చ్చిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అయ్యే తీరుతుంది. కాక‌పోతే అది ఎంత పెద్ద హిట్ అనే కంపేరిజ‌న్స్ వ‌స్తాయేమోన‌ని ఆలోచిస్తున్నాం`` అని అన్నారు. ఈ సినిమా మ‌ఫ్టీకి రీమేక్‌గా చేశారా? అని ప్ర‌శ్నించగా ``ఇది రీమేక్ కాదు. 90 శాతం కొత్త క‌థ ఉంటుంది. మేం చాలా స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశాం. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సార్ అత్య‌ద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. మేం ఎన్ని ట్యూన్లు అడిగినా రెహ‌మాన్ సార్ నో అని చెప్ప‌కుండా ఇచ్చారు. ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఆద‌రించిన తీరుకు ఫిదా అయిపోయాం. మార్చి 18న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఎ.ఆర్‌.రెహ‌మాన్ మా సినిమాలోని పాట‌ల‌తో లైవ్ కాన్స‌ర్ట్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా అంటేనే నా దృష్టిలో డైలాగులే కీల‌కం. అద్భుతంగా కుదిరాయి. శివ‌రాజ్‌కుమార్ క‌థ‌ను జ‌స్ట్ ట‌చ్ చేశాం. ఆ సినిమా చూసిన వారికి కూడా మా సినిమా కొత్త‌గా అనిపిస్తుంది. అంత బాగా శింబుకి టైల‌ర్ మేడ్ కేర‌క్ట‌ర్‌లాగా తీర్చిదిద్దాం`` అని అన్నారు. ప‌త్తు త‌ల టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది. రీసెంట్ టైమ్స్ లో స‌క్సెస్ మీదున్న శింబు, ఈ సినిమా ఆ స‌క్సెస్‌ని కంటిన్యూ చేస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.