English | Telugu
ఆమెతో నాని టచ్ లో లేడంట..!
Updated : Feb 20, 2014
నటుడు నానికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అందులో నందినిరెడ్డి పేరు ఖచ్చితంగా చెప్తాడు. అయితే నందిని ఇటీవలే "జబర్దస్త్" అనే సినిమా తీసింది. సినిమా ఫ్లాప్ కూడా అయ్యింది. అయితే ఈ సినిమా మొత్తం కూడా హిందీలో ఘన విజయం సాధించిన "బ్యాండ్ బాజా బారత్" రీమేక్ వలె ఉంటుంది. మరి నందిని తీసిన ఈ సినిమా నాని ఇప్పటివరకు కూడా చూడలేదంట. అంతే కాదు నందినిని కలిసి చాలా రోజులు అవుతుంది. ఇపుడు టచ్ లో లేము అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే నాని నటించిన "ఆహా కళ్యాణం" చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి జనాలు ఇదివరకే చూసిన "జబర్దస్త్" సినిమాతో పోల్చి.."ఆహా కళ్యాణం"ను ఫ్లాప్ చేస్తారో లేక నాని కోసమైన హిట్టు చేస్తారో మరో రెండు రోజుల్లోనే తెలియనుంది.