English | Telugu

చరిత్రను తిరగ రాసేవాడు, సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు.. నేనే ఆ చరిత్ర!

నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ2’ చిత్రం డిసెంబర్‌ 5న విడుదల కాబోతోంది. ఈ సంందర్భంగా కూకట్‌పల్లిలోని కైతలాపూర్‌ గ్రౌండ్స్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన నందమూరి అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా ఈ ఈవెంట్‌ జరిగింది.

ఈ సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘బోయపాటి శ్రీనుగారి కాంబినేషన్‌లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. ఇది నాలుగో సినిమా. మేం కలిసి సినిమా చెయ్యాలనుకుంటే మూడే మూడు నిమిషాలు మాట్లాడుకుంటాం. అంతే సినిమా స్టార్ట్‌ అవుతుంది. నాతో సినిమా చెయ్యాలంటే డిసిప్లిన్‌ ఉండాలి, తోటి నటీనటులను గౌరవించాలి. నేను పాదరసం లాంటివాడిని. ఏ క్యారెక్టర్‌లోనైనా ఇమిడిపోతాను. బోయపాటి శ్రీనుగారి కాంబినేషన్‌లో చేసిన అఖండ కరోనా తర్వాత రిలీజ్‌ అయింది. ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఇప్పుడు అఖండ2 దాన్ని మించి ఉంటుంది. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం ఉత్తరప్రదేశ్‌ వెళ్లినపుడు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌గారు ట్రైలర్‌ చూసి సనాతన ధర్మం గురించి ఎంతో బాగా చెప్పారు అని అభినందించారు. ఈ సినిమాలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. మీరు డిసెంబర్‌ 5న చూస్తారు. దేశాన్ని రక్షించేందుకు సైనికులు ఉన్నారు. అలాగే ధర్మాన్ని రక్షించేందుకు అఘోరాలు, స్వాములు ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. బాలకృష్ణ సినిమా అంటేనే ఉగాది పచ్చడిలాంటిది. అందులో అన్నీ ఉంటాయి. చరిత్రలో ఎంతో మంది ఉంటారు. కానీ, చరిత్రను తిరగరాసి చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే చరిత్ర. నాదే ఆ చరిత్ర’ అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.