English | Telugu

నాగార్జున నెక్స్ట్ చిత్రం వైరల్.. సరికొత్త  లుక్! 

కింగ్ 'నాగార్జున'(Nagarjuna)ప్రస్తుతం 'కూలీ'(Coolie)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. సైమన్ అనే క్యారక్టర్ లో తొలిసారి నెగటివ్ రోల్ లో, స్టైలిస్ట్ లుక్ తో నటించి అభిమానులతో పాటు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసాడు. గత చిత్రం కుబేర(Kuberaa)లో కూడా 'దీపక్' అనే డిఫరెంట్ క్యారక్టర్ ని పోషించి, స్క్రీన్ ప్రెజెన్స్ చెయ్యడంలో తనకి తిరుగులేదని నిరూపించాడు.

నాగార్జున తన నెక్స్ట్ మూవీని తమిళ దర్శకుడు 'రా కార్తీక్'(Ra Karthik)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. రా కార్తీక్ ఇప్పటి వరకు 'ఆకాశం', 'నితమ్ ఒరు వానం' వంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ ని తెరకెక్కించాడు. దీంతో నాగార్జునతో చెయ్యబోయే మూవీ ప్రత్యేకతని సంతరించుకుంది. పైగా నాగ్ నుంచి వస్తున్న 100 వ చిత్రం కావడంతో అభిమానులు, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున బర్త్ డే రోజైన అగస్ట్ 29 న ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది. మూవీలో నాగార్జున లుక్ కొత్తగా ఉండబోతుందని, సదరు లుక్ తోనే నాగార్జున చిత్ర ప్రకటన రోజు కనిపిస్తాడనే సమాచారం కూడా సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) పై నిర్మించనున్నాడు. సుదీర్ఘ కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నపూర్ణ బ్యానర్ కి ప్రత్యేక పేరు ఉంది. ఈ సంస్థ నుంచి ఎన్నో హిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియో ప్రారంభించి యాభై ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ సినిమా నాగార్జున చేస్తుండటం విశేషం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.