English | Telugu
నాగార్జున "రాజన్న" సెట్ తగలబడింది
Updated : Apr 5, 2011
నాగార్జున "రాజన్న" సెట్ తగలబడింది. వివరాల్లోకి వెళితే యువసామ్రాట్, కింగ్, అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తూ, అన్నపూర్ణ స్టుడియోస్ పతాకంపై, వి.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో స్వయంగా నిర్మిస్తున్న తెలంగాణా సాయుధ పోరాట యోధుడు "రాజన్న" చిత్రం యొక్క రోడ్ 10 లోని భూత్ బంగ్లాలో వేసిన సెట్ తగులబడింది. ఏప్రెల్ అయిదవ తేదీ రాత్రి 9 గంటలకు ఈ నాగార్జున "రాజన్న" చిత్రం కోసం వేసిన భారీ సెట్ తెలియని కారణాల వల్ల తగుల బడింది. అక్కడ సుమారు వంద గుడిసెల సెట్ వేయగా, వాటిలో సుమారు ఎనభై గుడిసెలు తగలబడిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
హైదరాబాద్ అగ్నిమాపక దళాలు ఆ సెట్ లో ఏర్పడిన మంటలను ఆర్పివేయటానికి అవిరళంగా కృషి చేస్తున్నాయి. ఈ నాగార్జున "రాజన్న"చిత్రానికి యాక్షన్ సీన్లను ప్రముఖ యువ దర్శకుడు యస్ యస్ రాజమౌళి దర౪శకత్వ పర్యవేక్షణ వహిస్తున్నారు. ఈ "రాజన్న"చిత్రం నిజాం నవాబుల నిరంకుశ పాలనకు సహకరిస్తున్న రజాకార్ల మీద తిరగబడ్ద తెలంగాణా సాయుధ పోరాట యోధుడు తెలుగు బిడ్డ రాజన్న నిజ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించబడుతున్న చిత్రం.