English | Telugu

త్రివిక్రమ్ భయపడి కట్ చేస్తున్నాడు!!

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తికి రిపేర్లు మొద‌లైపోయాయి. ఈ సినిమా ఇటీవ‌లే సెన్సార్ ముగించుకొచ్చింది. నిడివి చూస్తే 165 నిమిషాలొచ్చింది. ఈ రోజుల్లో ఈ లెంగ్త్ కాస్త ఎక్కువే అనిపిస్తుంది. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు, హాస్యం, అల్లు అర్జున్ స్టైల్.. ఇలా ఎన్ని హంగులున్నా అంత సేపు ఆడియ‌న్ థియేట‌ర్లో కూర్చుంటాడా..? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకొచ్చిన గొడ‌వ అనుకొని ఈ సినిమాని ట్రిమ్ చేసే ప‌నిలో ప‌డ్డాడు త్రివిక్ర‌మ్‌. దాదాపు 15 నిమిషాల సినిమాని క‌ట్ చేయాల‌నుకొంటున్నార‌ట‌. ఇక ఇప్పటికే ప్రచార చిత్రాలు, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, రిలీజ్ కు ముందే సంచనాలు,రికార్డులు ను నమోదు చేసింది.