English | Telugu
నాగార్జునకి ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందంట
Updated : Dec 6, 2023
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, సంగీత శిఖరం కీరవాణి ల కాంబినేషన్ కి ఉన్న కెపాసిటీ ఏంటో తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. మరి ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబో సృష్టించిన రికార్డ్స్ తెలుగు సిల్వర్ స్క్రీన్ కి ఇంకా బాగా తెలుసు. ఎన్నో హిట్ సాంగ్స్ రిపీటెడ్ గా ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించి నిర్మాతలకి కాసుల వర్షాన్ని కురిపించాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరు జత కట్టిన సినిమా యొక్క సాంగ్ ఒకటి అతి త్వరలో రాబోతుండటంతో నాగ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
నాగార్జున తాజాగా నా సామిరంగా అనే మూవీలో చేస్తున్నాడు.నాగ్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న మాస్ మూవీ కావడంతో ఈ సినిమా మీద నాగ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి.ఈ మూవీ నుంచి ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే అనే లిరిక్ తో స్టార్ట్ అయ్యే సాంగ్ ఒకటి రానుంది. ఈ మేరకు కమింగ్ సూన్ అంటు ఒక పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కళ్ళ జోడు పెట్టుకొని వైట్ కలర్ పంచె బ్లు కలర్ షర్ట్ తో నాగార్జున తన పక్కనే ఉన్న ట్రాకర్ మీద కాలు పెట్టి వీరమాస్ గెటప్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ పోస్టర్ ని చేసిన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సాంగ్ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
నాగార్జున కీరవాణి ల కాంబోలో వచ్చినన్ని మాస్ సాంగ్స్ బహుశా కీరవాణి ఇతర హీరోల కాంబోలో వచ్చి ఉండవు. అల్లరి అల్లుడు, ఘరానాబుల్లోడు, హలోబ్రదర్,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు,క్రిమినల్ లాంటి సినిమాల్లోని ఊర మాస్ పాటలని అక్కినేని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎవరు మర్చిపోలేరు. అలాగే ఆ పాటలన్ని నేటికీ మారుమోగిపోతూనే ఉంటాయి.