English | Telugu

పాన్ ఇండియా స్టార్లకు షాక్.. అజిత్ కి 150 కోట్లు ఆఫర్ చేసిన మైత్రి!

ప్రస్తుతం ఇండియాలో రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేన్ తీసుకుంటున్న హీరోలు పలువురు ఉన్నారు. వారిలో పాన్ ఇండియా స్టార్లే ఎక్కువ. అలాంటిది పాన్ ఇండియా మార్కెట్ పై పెద్దగా దృష్టి పెట్టని ఒక తమిళ స్టార్ కి ఓ ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం ఆఫర్ చేయడం ఆసక్తికరంగా మారింది.

కోలీవుడ్ స్టార్ అజిత్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడు. మొదట ఈ సినిమాకి దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు వినిపించింది. కానీ దర్శకుడు ఆయన కాదని, ఈ చిత్రానికి మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించి పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రి సంస్థ.. అజిత్ కి ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్.

హీరో రెమ్యునరేషనే ఈ స్థాయిలో ఉంటే.. బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుంది, సినిమాని ఏ స్థాయిలో రూపొందిస్తారనే చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.