English | Telugu

నా భర్త తమ్ముడు నాపై చేతబడి చేసాడు.. దేవుడి దయవల్ల బయటపడ్డాను

'గాడ్ ఆఫ్ మాసెస్ 'నందమూరి బాలకృష్ణ'(Balakrishna)సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన మూవీ 'ఆదిత్య 369 '. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిన ఫస్ట్ ట్రావెల్ టైమింగ్ మూవీగా కూడా నిలిచింది. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నటి 'మోహిని'(Mohini). తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన మోహిని తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసి మెప్పించింది. ఎటువంటి క్యారక్టర్ ని పోషించినా సరే, సదరు క్యారక్టర్ లో మనకి తెలిసిన పక్కింటి అమ్మాయిలా అనిపించడం 'మోహిని' స్పెషాలిటీ.

రీసెంట్ గా 'మోహిని' ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె తన సినీ, వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి తెలియచేసింది. ఆమె మాట్లాడుతు 'కన్మణి' అనే మూవీలో స్విమ్మింగ్ పూల్ సీన్‌లో బలవంతంగా సగం దుస్తులు వేసి నటించమన్నారు. ఈత రాదని ఏడ్చినా వినలేదు. ముత్తు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాల్లో అవకాశాలు చేజారిపోయాయి. నా భర్త కజిన్ నాపై చేతబడి చేసాడు. భగవంతుడి దయతో బయటపడ్డానని పేర్కొంది. ప్రస్తుతం మోహిని మాటలు వైరల్ గా నిలిచాయి.క్యారక్టర్ నటిగాను మోహిని తన సత్తా చాటింది. వరుస ప్లాప్ ల్లో ఉన్న 'మెగాస్టార్ చిరంజీవి'(Chiranjeevi)కెరీర్ కి బూస్టప్ ఇచ్చిన 'హిట్లర్' లోచిరంజీవి చెల్లెలుగా ధీటైన నటననే ప్రదర్శించడమే ఒక ఉదాహరణ. కెరీర్ పీక్ లో ఉన్నపుడే భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా(America)లో సెటిల్ అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకి భరత్ నుంచి విడాకులు తీసుకుంది. 2006 లో క్రైస్తవం స్వీకరించి ఆమెరికాలోనే ఉంటూ క్రైస్తవ మత ప్రచారకురాలిగా తన సేవలందిస్తుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు. 100కి పైగా చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .