English | Telugu

జయసుధ ఫోన్ లాగేసిన మోహన్ బాబు!

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తనకి ఏదనిపిస్తే అది చెప్తారు, ఏదనిపిస్తే అది చేస్తారు. అందుకే ఆయన మాటలు, చర్యలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఆయన సీనియర్ నటి జయసుధ చేతిలో నుంచి ఫోన్ లాగిన ఘటన హాట్ టాపిక్ గా మారింది.

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా జరిగిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మోహన్ బాబు, జయసుధ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, జయసుధ పక్కపక్కన కూర్చున్నారు. ఆ సమయంలో జయసుధ ఫోన్ పట్టుకొని చూస్తుండగా.. మోహన్ బాబు వెంటనే ఆ ఫోన్ లాగి, పక్కన పెట్టు అన్నట్టుగా కాస్త సీరియస్ లుక్ ఇచ్చారు. మొదట ఆ చర్యతో ఉలిక్కిపడిన జయసుధ, ఆ తర్వాత స్మైల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోని బట్టి చూస్తే.. జయసుధతో తనకున్న చనువు కొద్దీ 'ఈ సమయంలో ఫోన్ అవసరమా' అని ఫోన్ లాక్కొని పక్కన పెట్టమని మోహన్ బాబు చెప్పినట్టుగా అనిపిస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.