English | Telugu
ఓ మై గాడ్ ఏం జరుగుతోంది !!
Updated : Jun 5, 2014
ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలోనే సంచలనంగా మారబోతోందా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి మల్టీ స్టారర్ చిత్రం ఓ మై గాడ్. ఈ చిత్రంలో వెంకటేశ్, పవన్ కలిసి నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అది ఒక్కటే ఈ చిత్రానికి ప్రత్యేకత అనుకుంటే పొరపాటే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కలియుగ కృష్ణుడి అవతారంలో కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన లుక్కు గెటప్పు ఎలా వుంటాయో అని ఆల్ రెడీ అభిమానులు వెయిటింగ్. ఇంతే ఈ సినిమా ప్రత్యేకత అని ఆగిపోకండి.
హిందీ చిత్రం ఓ మై గాడ్‌కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో, హిందీ వర్షన్ లో లీలాధర్ స్వామీజీ పాత్రలో మిథున్ చక్రవర్తి నటించారు. డిస్కో డాన్స్ లతో ఒకప్పుడు యువతరాన్ని ఉర్రూతలూగించిన మిథున్ ప్రస్తుతం సినిమాలతో పాటు ప్రముఖ హిందీ టీవీ షోలలోను కనిపిస్తుంటారు. ఆయనే తెలుగు వర్షన్ లోనూ ఆ పాత్ర చేస్తే బాగుంటుందని నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి సారి మిథున్ చక్రవర్తి తెలుగు తెరపై కనిపించబోతున్నాడు. దీంతో ఈ చిత్ర విశేషాల చిట్టా అయిపోయిందని అనుకోవద్దు. ఇంకా వుంది.
ఈ మధ్య మనం సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చింది శ్రియ. మనం సినిమాలో శ్రియా నటన అద్భుతంగా ఉండటంతో ఓ మై గాడ్ చిత్రంలో వెంకటేశ్ పక్కన హీరోయిన్ గా శ్రియాని సెలెక్ట్ చేస్తున్నట్లు వినికిడి. సో, ఇన్ని స్పెషల్ సంగతులున్న ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది. సురేష్ బాబు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహిస్తున్నారు.