English | Telugu

మహేష్‌తో శృతి ఐటం సాంగ్


శృతిహాసన్ కెరీర్ ఇప్పుడు పీక్ లో వుంది. అయినా ఆమె ఐటం నంబర్ చేయడానికి సరేనందట. మహేష్ సినిమాలో చాన్స్ వస్తే నో చెప్పి ఛాన్స్ తీసుకోవడం ఎందుకనుకుందో ఏమో, ఐటం సాంగ్‌కి ఓకే అనేసిందట శృతి. గబ్బర్‌సింగ్ సినిమాతో హిట్‌ బాటలో నడుస్తున్న శృతి, రేసుగుర్రం మూవీలో సినిమా చూపిస్త మావ పాటలో అవుట్ అండ్ అవుట్ మాస్ గెటప్‌లో కనిపించింది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి పూర్తి స్థాయి ఐటమ్ సాంగ్‌లో కనిపించనుంది. అదీ మహేష్ బాబు ఆగడు చిత్రంలో.
శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో ఐటం నంబర్స్‌కి చాలా స్పెషాలిటీ వుంది. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన దూకుడు చిత్రంలో పార్వతిమెల్టన్, వెంకీ మూవీలో రాశి, అందరివాడులో రక్షిత గెస్ట్ సాంగ్స్‌లో మెరిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆగడు చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం శృతిహాసన్ ని అప్రోచ్ అవుతున్నట్లు టాకు మొదలైంది. సినిమాకు మరింత క్రేజ్ పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహేష్‌తో మణిరత్నం సినిమాలో శృతి నటించవలసి వుంది. కానీ ఆ చిత్రం ఆగిపోయిన తర్వాత శృతి, ప్రిన్స్‌తో కలిసి నటించే అవకాశం లేదేమో అనుకున్నారు. ఇప్పుడు ఆగడులో ప్రిన్స్‌తో కలిసి చిందేసే అవకాశం శృతి విడిచిపెట్టుకోదనే అనిపిస్తోంది. ఈ అవకాశం పూర్తి గా క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేసిందని టాక్. ఆగడులో మిల్కీ భామలిద్దరూ ప్రిన్స్ పక్కన నటించబోతున్నారన్నమాట. ఈ చిత్రంలో తొలిసారిగా మహేష పక్కన హీరోయిన్ గా తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.


రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.