English | Telugu

'ముల్లోక వీరుడు'గా మెగాస్టార్.. మరో ఇండస్ట్రీ హిట్ లోడింగ్!

ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 11న 'భోళా శంకర్'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. దీని తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఆయన 'బంగార్రాజు' ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో పాటు, 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు ఒకేసారి పట్టాలెక్కనున్నాయని అంటున్నారు. అంతేకాదు వశిష్టతో చేయబోయే సినిమాకి 'ముల్లోక వీరుడు' అనే ఆసక్తికర టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషించిన 'బింబిసార'తో వశిష్ట దర్శకుడిగా పరిచయమయ్యారు. సోషియో ఫాంటసీ ఫిల్మ్ గా రూపొందిన 'బింబిసార' గతేడాది ఆగస్టు లో విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తోనే ఆయన 'బింబిసార-2' తీస్తారు అనుకుంటే ఏవో కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. మధ్యలో సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలవడంతో ఆయనతో వశిష్ట రెండో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు వశిష్ట.

మెగాస్టార్ కెరీర్ లో ఆల్ టైం హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. ఆ చిత్రం తరహాలోనే చిరంజీవి కోసం వశిష్ట అదిరిపోయే సోషియో ఫాంటసీ కథని సిద్ధం చేశారట. ఈ కథ దేవలోకము, మానవలోకము, పాతాళలోకము ఇలా ముల్లోకాలను కలుపుతూ సాగుతుందని, ఇందులో చిరంజీవి పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని.. అందుకే ఈ సినిమాకి 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ని ఖరారు చేశారని వినికిడి. మొదటి సినిమాతోనే తాను సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ ని డీల్ చేయగలనని వశిష్ట నిరూపించుకున్నారు. మరి ఇప్పుడు మెగాస్టార్ తో చేయనున్న ఈ 'ముల్లోక వీరుడు'తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.