English | Telugu

మీనాక్షి చౌద‌రి లక్ ..ద‌శ మార్చిన మ‌హేష్!

మూడు నాలుగేళ్ల క్రిత‌మే హీరోయిన్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసిన హ‌ర్యానా బ్యూటీ మీనాక్షి చౌద‌రి ఇప్పుడు క్రేజీ ఆఫ‌ర్స్‌ను ద‌క్కించుకుంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ గుంటూరు కారంలో హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఆమె ఇప్పుడు మ‌రో అగ్ర హీరోతో జోడీ క‌ట్టే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇంత‌కీ మీనాక్షి చౌద‌రికి చాన్స్ ఇచ్చిన హీరో ఎవ‌రు? ఎవ‌రి స్థానంలో మీనాక్షి ఆ సినిమా అవ‌కాశాన్ని ద‌క్కించుకుంద‌నే విష‌యాల్లోకి వెళితే..

మీనాక్షి చౌద‌రి ఆనందం మామూలుగా లేదు. అందుకు కార‌ణం..ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో చాన్సులు రావ‌ట‌మే అందుకు కార‌ణ‌మ‌ని అంటున్నారు కొంద‌రు. విజ‌య్ ఆంటోని హీరోగా న‌టించిన హ‌త్య సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించటం ద్వారా సినీ రంగ ప్ర‌వేశం చేసిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌద‌రి. కోలీవుడ్ ఎంట్రీ త‌ర్వాత ఆమెకు సుశాంత్ హీరోగా న‌టించిన ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదులో అవ‌కాశం ద‌క్కింది. త‌ర్వాత మాస్ మ‌హారాజ ర‌వితేజ‌తో ఖిలాడి సినిమాలోనూ ఆడిపాడింది. అయితే ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాక‌పోవ‌టంతో మీనాక్షి చౌద‌రి డీలా ప‌డింది. అయితే అదే స‌మ‌యంలో ఆమెకు సూప‌ర్ స్టార్ మ‌హేష్ గుంటూరు కారం సినిమా సూప‌ర్బ్ ఎన‌ర్జీనిచ్చింది. ఆ సినిమా నుంచి పూజా హెగ్డే డ్రాప్ కావ‌టంతో ఆమె స్థానంలో మీనాక్షి చౌద‌రిని తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

గుంటూరు కారం మూవీ సెట్స్ పై ఉండ‌గానే మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో మీనాక్షి చౌద‌రి ఛాన్స్ కొట్టేసింద‌నే న్యూస్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఈ అమ్మ‌డుకి అవ‌కాశం వ‌చ్చిన సినిమా ఏదో కాదు..ద‌ళ‌ప‌తి విజ‌య్ 68వ చిత్రం. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ముందుగా ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ కాదు. ముందుగా మేక‌ర్స్ ప్రియాంక మోహ‌న్‌ను అనుకున్నారు. అయితే ఆమె అనుకోని కార‌ణాల‌తో ద‌ళ‌ప‌తి 68 నుంచి డ్రాప్ అయ్యింది. దీంతో నిర్మాత‌లు మీనాక్షి చౌద‌రిని ఆమె స్థానంలోకి ఎంపిక చేసుకున్నట్లు సినీ స‌ర్కిల్స్ టాక్‌.

ద‌ళ‌ప‌తి విజ‌య్ 68వ సినిమాలో మీనాక్షి చౌద‌రి న‌టిస్తుంద‌నే విష‌యం బ‌య‌ట‌కు రావ‌టంతో ముద్దుగుమ్మ ల‌క్‌ని సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మార్చేశార‌ని, ఆయ‌న సినిమాలో న‌టించ‌టం వ‌ల్ల‌నే ఇప్పుడు విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న చిత్రంలో ఈ సొగ‌స‌రికి అకాశం వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో మ‌హేష్ ఫ్యాన్స్ తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.