English | Telugu

ప్రభాస్ గురించి మాటల్లో చెప్పను చేతల్లోనే చూపిస్తాను

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో కాబట్టి ఆ రేంజ్ లోనే ప్రభాస్ నటిస్తున్న సినిమా కథలు తెరకెక్కుతు వస్తున్నాయి. కానీ అప్పుడప్పుడు మన తెలుగు నేటివిటీకి సంబంధించిన కథల్లోను ప్రభాస్ సినిమా చెయ్యాలని ఆయన ఫ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటినుంచో కోరుకుంటు వస్తున్నారు.ఎందుకంటే ప్రభాస్ గతంలో నటించిన డార్లింగ్, మిర్చి, ఏక్ నిరంజన్, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై లాంటి సినిమాల్లో మాస్ అండ్ కామెడీ నటనని సూపర్ గా చేసాడు. పైగా ఆ సినిమాల నుంచే ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇప్పుడు సరిగ్గా ప్రభాస్ నుంచి తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎలాంటి సినిమా అయితే కోరుకుంటున్నారో అలాంటి కధాంశాలకి పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచిని మేళవింపు చేసుకొని రాజా సాబ్ మూవీ రాబోతుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఆ చిత్ర దర్శకుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.

రాజాసాబ్ కి మారుతీ దర్శకత్వం వహిస్తున్న విషయం అందరకి తెలిసిందే. తాజాగా ఈ మూవీపై మారుతి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రాజా సాబ్ గురించి మాటల్లో చెప్పలేనని చేతల్లో చూపిస్తానని చెప్పాడు.అలాగే ప్రభాస్ లాంటి నటుడితో సినిమా చెయ్యడం తన అదృష్టమని కూడా ఆయన తెలిపాడు. తన కెరీర్ తొలినాళ్లలో ఈరోజుల్లో, బస్ స్టాప్ వంటి చిన్న సినిమాలు తీశానని అలా నెమ్మదిగా ప్రారంభమైన నా ప్రయాణం ఇప్పుడు ప్రభాస్ వరకు రావడం ఎంతో ఆనందంగా ఉందని కూడా ఆయన తెలిపాడు. అలాగే రాజాసాబ్‌ నుంచి సర్‌ప్రైజ్ అప్‌డేట్ కోసం వేచి ఉండండి అని కూడా చెప్పుకొచ్చాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై సుమారు 300 కోట్ల రూపాయిల భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ లో విజువల్స్ వండర్ సూపర్ గా ఉండబోతున్నాయనే టాక్ అయితే ఫిలిం వర్గాల్లో చాలా బలంగానే ఉంది. ముఖ్యంగా మూవీలో వచ్చే యాక్షన్ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయనే టాక్.కూడా వినపడుతుంది.అలాగే ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ తో జత కట్టబోతున్నారనే ప్రచారం కూడా ఉంది. థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.