English | Telugu
గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్!
Updated : Feb 5, 2024
సినిమా రంగంలో ఆస్కార్ అవార్డ్ ఎంత ప్రతిష్ఠాత్మకమైనదో, సంగీత ప్రపంచంలో గ్రామీ అవార్డ్స్ అంతటి ప్రాధాన్యం ఉంది. ఏ గాయకులైనా తను గ్రామీ అవార్డు సాధించాలన్న లక్ష్యంతో ఉంటారు. ప్రతి ఏడాది అమెరికాలో గ్రామీ అవార్డుల ప్రదానం ఓ పండగలా జరుపుతారు. ఈ ఏడాది కూడా అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఆదివారం 66వ గ్రామీ అవార్డ్స్ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ప్రపంచ దేశాలకు చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. తమ పాటలతో ఆహూతులను అలరించారు.
ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ గ్రామీ అవార్డు అందుకొని భారత ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి తెలియజేశారు. వీరు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఉత్తమ గ్లోబల్ ఆల్బమ్ అవార్డును గెలుచుకుంది. ఈపాటను జాన్ మెక్ లాప్లిన్ (గిటార్), జాకీర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్ (సింగర్), గణేష్ రాజగోపాలన్(వయోలిన్).. ఇలా మొత్తం ఎనిమిది మంది శక్తి బ్యాండ్ పేరిట ఈ ఆల్బమ్‌ను కంపోజ్ చేసారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి నుంచి పోటీని ఎదుర్కుని శక్తి బ్యాండ్ విజేతగా నిలిచింది. గ్రామీ అవార్డుల్లో ‘పాష్తో’కి గాను ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మూడు అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించారు.