English | Telugu

స్పిరిట్ ఫస్ట్ లుక్.. అంచనాలను అందుకుందా?

Publish Date:Jan 1, 2026

  ప్రస్తుతం మోస్ట్ హైప్డ్ ఇండియన్ సినిమాలలో 'స్పిరిట్' ఒకటి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై కేవలం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఆడియో టీజర్ ఆ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. (Spirit First Look)   న్యూ ఇయర్ కానుకగా 'స్పిరిట్' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ లో షర్ట్ లేకుండా, ఒంటినిండా గాయాలతో, చేతిలో మందు బాటిల్ పట్టుకొని ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రభాస్ ని సందీప్ చూపించే తీరుకి.. ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని అంటున్నారు.   అయితే 'స్పిరిట్' ఫస్ట్ లుక్ పై కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. పోస్టర్ ఆర్టిఫిషియల్ గా ఉందని, కొత్తదనం లేదని, సందీప్ రెడ్డి గత చిత్రం యానిమల్ ని గుర్తు చేస్తుందని.. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇలా ఒకట్రెండు నెగెటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ.. మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం 'స్పిరిట్' ఫస్ట్ లుక్ ని ఆకాశానికెత్తేస్తున్నారు.    

Prabhas’ Powerful First Look As AJANUBAHUDU From Spirit Unveiled

Publish Date:Jan 1, 2026

  Rebel Star Prabhas is set to unleash one of the most intense chapters of his career with Spirit, being helmed by Sandeep Reddy Vanga, who delivered hat-trick blockbusters with his first three movies. The makers welcomed the New Year by dropping a powerful first look that has instantly sparked conversation.   Sandeep Reddy Vanga shared, "INDIAN CINEMA.... witness your AJANUBAHUDU / AJANUBAHU 🫡 Happy New Year 2026 🤗 #SpiritFirstLook”     The poster introduces Prabhas in a raw, unfiltered avatar. Shot from behind, his bare, sculpted frame is riddled with scars, bruises, and bandages, silently narrating a life shaped by violence and survival. His long hair and thick beard add to the intensity of the character.   A liquor bottle clenched in his hand, Prabhas’ posture reflects exhaustion, anger, and inner chaos. Adding to the mood is Tripti Dimri, who appears beside him in a charged, close moment as she lights his cigarette.   The first look presents the character as intense, broken, and powerful, signaling a brutal film with a focus on violence, inner conflict, and strength.   The film is currently in its early stages of production, and Prabhas has already begun building anticipation by openly expressing his excitement and enthusiastically hyping the project.  

ఆ విషయంలో నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి.. ఆలోచించండి!

Publish Date:Dec 31, 2025

(డిసెంబర్‌ 31 ఆర్‌.నారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా..) ‘భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరు.. భర్తగ మారకు బ్యాచ్‌లరు..’, ‘వద్దుర సోదరా.. పెళ్లంటే నూరేళ్ళ మంటరా..’.. ఇది కొంతమంది మగవారి నిశ్చితాభిప్రాయం. దానికి తగ్గట్టుగానే ఎంత వయసు వచ్చినా బ్యాచ్‌లర్‌ లైఫ్‌నే లీడ్‌ చేస్తున్నారు. మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల ఇప్పటి యూత్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న మాట వాస్తవం. కానీ, 50 ఏళ్ల క్రితమే పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి పెళ్లి వద్దు, భార్య వద్దు అని భీష్మించుకొని కూర్చున్నారు. 70 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ బ్యాచ్‌లర్‌గానే కొనసాగుతున్నారు. అయితే కొన్నేళ్ల క్రితమే ఆయన ఈ విషయంలో రియలైజ్‌ అయ్యారు. పెళ్లి చేసుకోకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి తెలుసుకున్నారు. తను పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది. అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు తన మానసిక పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల గురించి ప్రస్తావించారు ఆర్‌.నారాయణమూర్తి.    ‘నేను ఒక సాధారణ వ్యక్తిని. సింపుల్‌గా ఉండేందుకే ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది. సింపుల్‌గా ఉండడంలోనే నాకు ఆనందం ఉంది. ఇల్లు, కారు అంటూ సొంత ఆస్తులు కూడబెట్టకూడదు అనేది చిన్నతనం నుంచి నాకు ఉన్న ఆలోచన. మా సినిమా వాళ్లకి చాలామందికి ఇళ్లు ఇచ్చారు. నన్ను కూడా తీసుకోమని చెప్పారు. కానీ, నేను తీసుకోలేదు.    ఇక పెళ్లి విషయానికి వస్తే.. నా జీవితంలోనూ ఒక ప్రేమ కథ ఉంది. చదువుకునే రోజుల్లోనే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెళ్లి విషయం మాట్లాడేందుకు వాళ్ళ ఇంటికి వెళ్లినపుడు తెలిసింది. వాళ్లు చాలా డబ్బున్నవారు. వాళ్ల స్థాయి వేరు, నా స్థితి వేరు. ఇద్దరికీ పొసగదు అనే నిర్ణయం తీసుకొని ఆ క్షణమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం విని ఆ అమ్మాయి చాలా బాధపడిరది. అయినా నేను నా నిర్ణయం మార్చుకోలేదు. అంతేకాదు, అప్పటి నుంచి ఒంటరి జీవితాన్నే గడుపుతున్నాను.   సినిమాల్లో తెలియకుండానే కాలం గడిచిపోయింది. 50 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకోలేదన్న బాధ మొదలైంది. ఎందుకిలా చేశాను అనిపించింది. నాకంటూ ఒక మనిషి, ఒక ఇల్లు ఉంటే బాగుండేది అనుకున్నాను. పెళ్లి, ఇల్లు లేకుండా ఇప్పటివరకు నా జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చాను. దీని గురించి ఇంటి దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు రెండు పక్షులు ఎగురుకుంటూ గూటిలోకి వెళ్ళడం చూశాను. జంటగా ఉండడం అనేది ప్రకృతి ధర్మం. ప్రతి మనిషికి తోడు, నీడ చాలా అవసరం. అది నా స్వానుభవంతో తెలుసుకున్నాను.    పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్స్‌గా ఉండిపోవాలనే ఆలోచన కొంతమంది కుర్రాళ్లలో కూడా ఉంది. కానీ, దాన్ని పక్కన పెట్టండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోండి. పిల్లల్ని కనండి. ఇల్లు కట్టుకోండి. కార్లు కొనుక్కోండి. లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యండి. హాయిగా ఉండండి. నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి. నా అనుభవంతో చెబుతున్నాను’ అంటూ నేటి యువతకు సందేశాన్ని ఇచ్చారు ఆర్‌.నారాయణమూర్తి. 

సల్మాన్ ఖాన్ మూవీపై చైనా ఆగ్రహం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సల్మాన్  డైలాగులు 

Publish Date:Dec 30, 2025

    -ఎందుకు అంత అక్కసు  -ఏముంది ఆ మూవీలో  -చైనా మీడియా ఏం చెప్తుంది -సల్మాన్ ఏం చెప్పాడు       సికిందర్ పరాజయంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని లక్ష్యంతో తన కట్ అవుట్ కి తగ్గ మూవీ' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'(Battle of galwan)తో సల్మాన్ ఖాన్(Salman Khan)ముస్తాబు అవుతున్నాడు. చైనా, మన దేశానికి మధ్య గల్వాన్(Galwan)నది హద్దు విషయంలో 2020 జూన్ 16 న జరిగిన యుద్దాన్ని బేస్ చేసుకొని తెరకెక్కుతుంది. అప్పట్లో ఆ పోరాటంలో మన సైనికులు ఇరవై మంది వరకు చనిపోయారు. రీసెంట్ గా మొన్న 27 న జరిగిన సల్మాన్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' నుంచి టీజర్ రిలీజ్ చేసారు.సదరు టీజర్ లో సల్మాన్ నుంచి వచ్చిన చావుకి ఎందుకు భయపడతారు, అది అనివార్యం అనే డైలాగ్ తో పాటు మరిన్ని డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై తమ అక్కసుని ప్రదర్శిస్తుంది.       అంతర్జాతీయ సమాజాన్ని తప్పు దోవ పట్టించి చైనా పై వ్యతిరేకతని రెచ్చగొట్టేందుకు భారత్ చరిత్రని వక్రీకరిస్తుంది. గల్వాన్ లో ఘర్షణలకి భారత్ నే కారణం. భారత దళాలు అక్రమంగా చైనా భూభాగంలోకి చొరబడి దాడి చేసాయి.  బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రం జాతీయ వాదంతో కూడిన మెలోడ్రామా అని గ్లోబల్ టైమ్స్ లో  రాసుకొచ్చింది. చైనా సైనిక నిపుణుడు  సాంగ్ జాంగ్ పింగ్ కూడా మాట్లాడుతు 'చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించుకోవాలనుకునే మా సైనికుల దృఢ సంకల్పాన్ని మా సైనికులు కోల్పోరు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది.       Also read:  కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే      గల్వాన్ నది చైనా పాలనలో ఉన్న వివాదాస్పద 'అక్సాయ్ చిన్' ప్రాంతం నుండి భారతదేశంలోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రవహిస్తుంది . ఇది కారకోరం శ్రేణికి తూర్పు వైపున ఉన్న సామ్‌జుంగ్లింగ్ యొక్క కారవాన్ క్యాంపింగ్ గ్రౌండ్ సమీపంలో ఉద్భవించి పశ్చిమాన ప్రవహించి ష్యోక్ నదిలో కలుస్తుంది . సంగమ స్థానం దౌలత్ బేగ్ ఓల్డీకి దక్షిణంగా 102 కి.మీ దూరంలో ఉంది. ష్యోక్ నది సింధు నదికి ఉపనది , గల్వాన్‌ను సింధు నది వ్యవస్థలో భాగం చేస్తుంది. ఈ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఎప్పట్నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఇక బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కి అపూర్వ లఖియా(Apoorva Lakhia)దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ ఖాన్ సొంతంగా నిర్మిస్తున్నాడు. చిత్రాంగద కధానాయిక.  

హోస్టింగ్ నేను చేస్తే బాగుంటుందన్నారు.. ప్రదీప్ చేంజ్ అవలేదన్న నిధి!

Publish Date:Jan 1, 2026

  బిబి జోడి సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "ఇక నుంచి మీ సండే నైట్స్ ఇంకాస్త ఎంటర్టైనింగ్ గా మారబోతున్నాయి. ఎందుకంటే మా బిబి జోడి సీజన్ 2 లో ధమాకా జోడీలు దుమ్ము దులపడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.    "ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లు వస్తుంటాయి" అంటూ ప్రదీప్ మానస్ జోడీకి చెప్తుండగా మణికంఠ మధ్యలో వచ్చి "హోస్టింగ్ నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు" అంటూ మణికంఠ చెప్పాడు. "నువ్వు వేరే వాళ్ళ అకౌంట్ లో కామెంట్స్ చదివి ఉంటావ్" అన్నాడు ప్రదీప్. "మీరింత బాగా డాన్స్ చేస్తారని తెలీదు. మా దాంట్లో ఐటెం సాంగ్ ఉంది చేస్తారంటే " అంటూ ధనరాజ్ ఒక విషయం చెప్పేసరికి మానస్ "వ్వావ్" అన్నాడు. జడ్జ్ శ్రీదేవి అతని ఎక్స్ప్రెషన్ చూసి "ఒకసారి మళ్ళీ చూపించండి ఆ ఎక్స్ప్రెషన్" అని అడిగింది. "వ్వావ్ చాలా ఉంది ధమాకా జోడీస్ కి" అని కౌంటర్ ఇచ్చింది.    తర్వాత స్టేజి మీదకు రాజా సాబ్ ముగ్గురు హీరోయిన్స్ వచ్చారు. "కొత్త సంవత్సరం జాతకంలో మంచి కలర్ ఫుల్ గా ఉంటుంది అంటే ఏంటో అనుకున్నాను" అంటూ బాగా ఫ్లర్ట్ చేసాడు. "ప్రదీప్ గారు మీరేం చేంజ్ అవలేదు కదా " అంటూ నిధి అగర్వాల్ ప్రదీప్ మీద డైలాగ్ వేసింది. "అస్సలు చేంజ్ అవలేదు" అంటూ శేఖర్ మాష్టర్ కోరస్ ఇచ్చాడు. "కానీ మీరు అందరికీ సేమ్ థింగ్ చెప్తారు" అంటూ నిధి మళ్ళీ ప్రదీప్ మీద కౌంటర్ వేసింది.    తర్వాత "బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్" థీమ్ మీద మానస్ - స్రష్టి వర్మ చేసిన డాన్స్ కి జడ్జెస్ ఫిదా ఇపోయారు. జడ్జ్ శ్రీదేవి గోల్డెన్ రోజ్ ఇచ్చింది. ఈ థీమ్ కి పక్కా న్యాయం చేశారు అంటూ శేఖర్ మాష్టర్ చెప్పాడు.  

రామ్ చరణ్ డైరెక్టర్ తో దుల్కర్ సల్మాన్ మూవీ!

Publish Date:Dec 31, 2025

  మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)కి తెలుగునాట కూడా మంచి గుర్తింపు ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ప్రస్తుతం తెలుగులో 'ఆకాశంలో ఒక తార'తో పాటు ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక ఫిల్మ్ చేయడానికి దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు.   ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది.. రెండో సినిమాకే రామ్ చరణ్ తో 'రచ్చ' చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దుల్కర్ ని డైరెక్ట్ చేయనున్నాడట.   ఇప్పటికే దుల్కర్ సల్మాన్, సంపత్ నంది మధ్య కథా చర్చలు జరిగాయని.. సంపత్ చెప్పిన స్టోరీ లైన్ కి దుల్కర్ ఇంప్రెస్ అయ్యాడని వినికిడి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.  

Are Vijay and Rashmika planning wedding on this date?

Publish Date:Dec 29, 2025

Vijay Deverakonda and Rashmika Mandanna are said to be in love from the moment they have become close on the sets of Geetha Govindam. Their friendship grew further after she cancelled her engagement with Rakshit Shetty and their off-screen intimacy grew further.  They have always maintained that they are friends and become close family friends as well. Rashmika Mandanna, in recent times, started being more open about how she values Vijay's existence in her life and how she wishes him to make a huge comeback in his career as he is struggling with commercial hits.  He also wished her on every success of hers and even powered her recent film, The Girlfriend, by giving voice over for trailer. Now, the rumors have been rampant about the couple getting engaged in a private ceremony last year. The rumors have stated that both the families have agreed for their marriage and are preparing for marriage.  Today, the rumors have surfaced about the couple getting married at Udaipur Palace on 26th February 2026. The arrangements about this huge wedding are going on say the reports and both the actors' families are silent on these reports. Well, will they officially confirm or deny these reports, we have to wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969