English | Telugu

న్యూజిలాండ్ దేవుడు సృష్టించిన నగరం అంటున్న కన్నప్ప 

తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం మంచు మోహన్ బాబు అనే పేరు వినిపిస్తునే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి ఎన్నో రికార్డులని సృష్టించిన ఘనత మోహన్ బాబు సొంతం. ఇప్పుడు ఆయన నిర్మాతగా ఆయన నట వారసుడు మంచు విష్ణు భక్త కన్నప్పగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప. పరమశివుడికి పరమ భక్తుడైన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతు ఉంది. తాజాగా కన్నప్పకి సంబంధించిన విషయాల గురించి విష్ణు ప్రేక్షకులతో పంచుకున్నాడు.

భారతీయ సినిమా ప్రేక్షకులకి కన్నప్ప సినిమా చూస్తున్నంత సేపు నిజమైన కన్నప్ప తిరిగిన ఆనాటి వాతావరణాన్ని చూశామనే అనుభూతిని పొందడానికి న్యూజిలాండ్ పర్ఫెక్ట్ వాతావరణమనిఒక రకంగా చెప్పాలంటే న్యూజిలాండ్ దేవుడు సృష్టించిన అందమైన పెయింటింగ్ లాంటిదని విష్ణు అన్నాడు. మా కన్నప్ప సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ ని న్యూజిలాండ్‌ లోని లొకేషన్లు పూర్తిగా ఎలివేట్ చేస్తాయి.అలాగే రాబోతున్న తరాల వారికి గుర్తిండిపోయేలా ఒక కళాఖండంగా మా కన్నప్పను తెరకెక్కిస్తున్నామని కూడా మంచు విష్ణు చెప్పాడు.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ మొత్తం దాదాపుగా న్యూజిలాండ్‌లోనే జరగనుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, శరత్ కుమార్ వంటి అగ్రనటులు నటించబోతున్నారని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ఇటీవల కన్నప్ప షూటింగ్ లో గాయపడిన విష్ణు తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.