English | Telugu
మంచు మనోజ్ కొత్త సినిమా మొదలైంది
Updated : Jun 8, 2015
శ్రీ.. సరిగ్గా పదేళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు చిత్రం పేరిది. తమన్నా హీరోయిన్‌గా పరిచయమైంది ఈ సినిమాతోనే. మంచు మనోజ్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మళ్లీ పదేళ్ల తరువాత మంచు మనోజ్, దశరథ్ దర్శకత్వంలో మరో చిత్రం రాబోతుంది. ఇప్పుడు కథానాయికగా తమన్నా స్థానంలోకి రెజీనా చేరింది. భద్రాద్రి, ఆకాశంలో సగం, సూర్య వెర్సస్ సూర్య చిత్రాలను నిర్మించిన ఎం.శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేః గోపీ మోహన్, కెమెరాః మల్హర్ భట్ జోషి, సంగీతం: కె.వేదా.