English | Telugu
మంచు మనోజ్ ప్రేమలో పడ్డాడు
Updated : Jan 20, 2015
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో మంచు మనోజ్ పేరు కూడా ఉంది. పెళ్లెప్పుడు అని ఎప్పుడు అడిగినా `నాకింకా పెళ్లీడు రాలేదు..` అని తప్పించుకొనేవాడు. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే మనోడు పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట. ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని గత ఏడాదిగా మనోజ్ ప్రేమిస్తున్నాడని, వీళ్లిద్దరి పెళ్లికి ఇంట్లోవాళ్లు కూడా ఒప్పుకొన్నారని, ఈ యేడాదే మనోజ్ ఓ ఇంటివాడవుతున్నాడని లేటెస్ట్ టాక్. ప్రణీత రెడ్డి ఎవరో కాదు... మనోజ్ వదిన వెరోనికా రెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ అట. అలా... వదిన స్నేహితురాల్ని లైన్లో పెట్టేశాడు మనోజ్ త్వరలోనే.. మనోజ్ పెళ్లికబురు వినే అవకాశాలున్నాయి. నిశ్చితార్థం సింపుల్‌గా జరిపించేసి, ఈయేడాదే పెళ్లి బాజాలు మోగించాలని మోహన్ బాబు ఫ్యామిలీ భావిస్తోంది.