English | Telugu

పవన్ కి ఇంకా 8 కోట్లు కావాలి

వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌లాంటి స్టార్స్‌ నటించిన 'గోపాల గోపాల' సినిమాకి టాక్‌ గొప్పగా లేకపోయినప్పటికి మేకర్స్‌కి స్టార్‌ బలమే కవచంగా మారింది. తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ముప్పయ్‌ ఎనిమిది కోట్ల రూపాయల షేర్‌ రాబట్టింది. అయితే ఈ కలెక్షన్లతో బయ్యర్లు ఆనందపడడం లేదు. ఎందుకంటే ఈ చిత్రం సేఫ్‌ అనిపించుకోవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ చిత్రానికి మరో ఎనిమిది కోట్లు వస్తే కానీ హిట్‌ స్టేటస్‌ దక్కదు. సెలవులు అయిపోయాయి కాబట్టి ఇక్కడ్నుంచి ఎనిమిది కోట్ల షేర్‌ రావడం అంత తేలికేం కాదు. సెలవుల తర్వాత సోమవారం నాడు కలెక్షన్లు బాగా పడిపోతాయని అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకి పైగా షేర్‌ సాధించి, ఇంకా స్టడీగా నడుస్తోందని స్పష్టం చేసింది. ఈవెనింగ్‌ షోలు, వీకెండ్లు ఎంత బాగుంటాయో అనే దానిని బట్టి ఈ చిత్రం ఫుల్‌ రన్‌ కలెక్షన్స్‌, ఫైనల్‌ రేంజ్‌ డిపెండ్‌ అవుతుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.